Student Speech: ఏం స్పీచ్ రా బాబూ.. ఇంటర్‌నెట్‌ను షేక్ చేసేసావ్..!
సాధారణంగా ఉపన్యాసాలు అంటే ఎవరు పెద్దగా ఆసక్తి చూపరు.
దిశ, వెబ్ డెస్క్: సాధారణంగా ఉపన్యాసాలు అంటే ఎవరు పెద్దగా ఆసక్తి చూపరు. ఎప్పుడెప్పుడూ ప్రసంగాన్ని (Speech) ముగించేస్తారా? అన్నట్లుగా చూస్తుంటారు. కానీ, పాఠశాల వార్షికోత్సవంలో (School anniversary) ఓ విద్యార్థి చేసిన ఆవేశపూరితమైన ప్రసంగం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. అతడు చెబుతున్నంత సేపు అక్కడున్న వారంతా ఉత్కంఠగా చూస్తుండిపోయారు. నేపాల్‌లో (Nepal) చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఆ విద్యార్థి ఏ అంశంపై ఉపన్యాసం ఇచ్చాడో ఇక్కడ తెలుసుకుందాం.
నేపాల్‌లో ఓ పాఠశాల ఇటీవల తమ 24వ వార్షిక వేడుకలను నిర్వహించుకుంది. ఈ వేడుకల్లో అభిస్కర్ రౌత్ అనే విద్యార్థి తమ దేశంలోని రాజకీయ, ఆర్థిక సవాళ్లపై ఆందోళన వ్యక్తం చేస్తూ అద్భుతమైన ప్రసంగం ఇచ్చాడు. 'ఈ రోజు, నేను కొత్త నేపాల్‌ను నిర్మించాలనే ఆశయంతో ఉన్నాను. ఆశ, ఆకాంక్షల జ్వాల నాలో భగ్గుమంటోంది. కానీ ఈ కల జారిపోతున్నందున ఆలోచనతో నా హృదయంతో బాధతో బరువెక్కింది. మనలో అలుముకుంటున్న అజ్ఞానం అనే చీకటిని పారద్రోలి చైతన్యం అనే వెలుగుని నింపేందుకే ఇక్కడికి వచ్చాను. స్మారక మార్పుతో చరిత్ర గమనాన్ని అమరత్వం చేసేందుకే ఇక్కడ నుంచి మాట్లాడుతున్నా..' అని ఉపన్యాసంలో తెలిపాడు.
అలాగే, 'మన మాతృభూమికి నేపాల్ పౌరులుగా న్యాయంగా ఇవ్వాల్సినది తిరిగి ఇస్తున్నారా?, మనల్ని పోషిస్తున్న మన దేశం రుణం తీర్చుకుంటున్నామా?' అనే ప్రశ్నను లెవనెత్తాడు. 'మనం ఆ మాతకు ఇవ్వాల్సింది కేవలం కృషి, సహకారం, నిజాయితీలే. కానీ మనం ఏం చేస్తున్నాం. నిరుద్యోగంతో అలమటిస్తున్నాం.. రాజకీయ పార్టీల స్వార్థపూరిత ఆటలో చిక్కుకుంటున్నాం. అవినీతి మన భవిష్యత్తు వెలుగులను ఆర్పేసేలా వల అల్లింది అంటూ భావోద్వేగంగా అభిస్కర్ రౌత్ ప్రసంగించాడు.
ప్రస్తుతం ఈ వీడియో వైరల్ కాగా.. ఆ స్టూడెంట్ ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని కొందరు నెటిజన్లు ప్రశంసించగా. మరికొందరూ ఇది వార్షికోత్సవం విలీనం కాదంటూ కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. కాగా, 2008లో దేశంలో నెలకొన్న అంతర్యుద్ధానికి తెర దించడానికి నేపాల్ ప్రభుత్వం 239 ఏళ్ల హిందూ రాచరికాన్ని రద్దు చేసింది. అయితే, హిందూ రాచరికం తిరిగి రావాలని సాధారణ నేపాల్ పౌరులు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ విద్యార్థి ప్రసంగం అందరనీ ఆలోచింపజేసేలా ఉండటం విశేషం.
Read More..
Ramadan fasting: రంజాన్ ఉపవాసంలో ఏ ఖర్జూరం తింటే మేలు..?