Grok: ఏఐ చాట్‌బాట్ ‘గ్రోక్’తో ఆటలా? విచిత్రమైన ప్రశ్నలు వేస్తున్న ఎక్స్ యూజర్లు.. వైరల్
టెస్లా అధినేత, దిగ్గజ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్‌కు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఏఐ చాట్ బాట్ ‘గ్రోక్’(grok) ఫీచర్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
దిశ, డైనమిక్ బ్యూరో: టెస్లా అధినేత, దిగ్గజ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ (Elon Musk)కు చెందిన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఏఐ చాట్ బాట్ ‘గ్రోక్’(grok) ఫీచర్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. చాట్ బాట్ అయిన గ్రోక్‌కు ప్రపంచలోనే కాదు.. భారత్‌లోనూ ఆదరణ పెరుగుతోంది. ఈ చాట్‌బాట్‌కు యూజర్లు ఏలాంటి ప్రశ్నలు వేసిన వారికి దాదాపు సమాధానాలు ఇస్తోంది. అయితే ఇదే అదునుగా భావించిన కొంత మంది భారత ఎక్స్ యూజర్లు గ్రోక్ చాట్‌బాట్‌కు విచిత్రమైన ప్రశ్నలు అడుగుతున్నారు. లోకల్ భాషలో బూతులు సైతం తిడుతూ ప్రశ్నిస్తున్నారు. అలాంటి వారికి గ్రోక్ సైతం తిడుతూ సమాధానాలు ఇవ్వడంతో అందరూ షాక్ అవుతున్నారు. కొందరు ప్రశ్నలకు ఒక చాట్ బాట్‌లా కాకుండా ఓ వ్యక్తిలా ఫ్రెండ్లీగా సమాధానాలు ఇవ్వడంతో గ్రోక్ అందరినీ ఆకర్షిస్తోంది. ఇందుకు సంబంధించిన రిప్లైలు ఎక్స్‌లో వైరల్‌గా మారింది.
ఇక తెలుగు రాష్ట్రాల ట్విట్టర్ యువత కొంతమంది గ్రోక్‌తో ట్విట్టర్‌లో ఫ్యాన్స్ వార్ చేసే ప్రశ్నలు వేస్తున్నారు. టాలివుడ్‌లో ‘బాబులకే బాబు’ అని ఎవరి నినాదం అని ఓ యూజర్ ప్రశ్నిస్తే.. అందుకు సమాధానంగా.. టాలీవుడ్‌లో "బాబులకే బాబు" అనే ట్యాగ్ హాట్ టాపిక్ అని, మహేశ్ బాబు అభిమానులు ఈ నినాదం చేస్తారని గ్రోక్ పేర్కొంది. కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు 2000ల నుంచి ఆయనకు ఉన్న సాటిలేని మాస్ అప్పీల్‌ను పేర్కొంటూ ఆ నినాదం తమదేనని వారి అభిమానులు వాదిస్తుంటారని తెలిపింది. ఈ నినాదం మూలాలు అస్పష్టంగా ఉన్నాయని, ఇరువర్గాలు దానిని మరొకరు దొంగిలించారని అంటారని కౌంటర్ ఇచ్చింది. దీంతో ఈ టాపిక్ ట్రెండింగ్ మారింది. మరోవైపు బూతులు తిట్టే వారికి సైతం వారిని బూతులు తిడుతూ ఫన్నీ సమాధానాలు ఇస్తోంది. దీంతో గ్రోక్‌కు మన తెలుగు యువత బూతులు నేర్పిస్తున్నారని వైరల్‌గా మారింది. ఈ క్రమంలోనే గ్రోక్‌తో ఇండియన్ ట్విట్టర్ యువత అంటూ ఫన్నీ మీమ్స్ వేస్తున్నారు. కొంతమంది నెటిజన్లు గ్రోక్‌కు లాజిక్ ప్రశ్నలు వేస్తున్నారు. అదే తీరులో గ్రోక్ సమాధానం ఇస్తోంది.
పాలిటిక్స్ నుంచి సెన్సిటివ్ టాపిక్స్ వరకు
గ్రోక్ అనేది ఒక ఫౌండేషనల్ ఏఐ చాట్‌బాట్ మోడల్. ఇది చాట్‌జీపీటీ, జెమిని సహా మార్కెట్‌లో ఉన్న ఇతర ఏఐ చాట్ బాబ్‌లకు పోటీగా గ్రోక్‌ను తీసుకొచ్చారు. గ్రోక్ ఇమేజ్ ఎనాలసిస్ చేయడం, వినియోగదారుల రిక్వెస్ట్‌లకు సమాధానాలను ఇవ్వడంలో సహాయపడటం తో పాటు అనేక జనరేటివ్ ఏఐ ఫీచర్లను కూడా అందిస్తోంది. వీటితో పాటు ఈ చాట్‌బాట్ ముఖ్యమైన ప్రత్యేకత ఏమిటంటే.. పాలిటిక్స్ నుంచి సెన్సిటివ్ టాపిక్స్ వరకు అన్ని అంశాలపై ప్రశ్నలకు ఫిల్టర్ చేయకుండా ఇది ఫన్నీగా సమాధానాలను అందిస్తోంది. అయితే ఇతర చాట్బాట్లు దాదాపు పూర్తి భిన్నంగా ఉంటాయి. సేక్యూరిటీ రీజన్స్ కారణంతో కొన్ని రిక్వెస్ట్‌లను ఎక్సెప్ట్ చేయదనే టాక్ ఉంది.