ఏపీలో హైకోర్టు ఆర్డర్కే దిక్కులేదు: టీడీపీ
దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియా వేదికగా తెలుగుదేశం పార్టీ ఏపీ ప్రభుత్వం పై విమర్శలు, ఆరోపణలు చేసింది. తాజాగా టీడీపీ అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ.. ‘రాష్ట్రంలో హైకోర్టు ఆర్డర్ కే దిక్కులేదు. జాయింట్ కలెక్టర్‌కు హైకోర్టు ఆర్డర్ కన్నా వైసీపీ నాయకుల మాటే శిరోధార్యం అయిపోయింది. చట్టాన్ని అమలు చేయాల్సిన కలెక్టర్ ఇలా వైసీపీ ఎమ్మెల్యేకు బంట్రోతుగా వ్యవహరించడం దురదృష్టకరం. పలాస నియోజకవర్గం, మందస మండలం, చిక్కుడు గ్రామంలో వీడియోలో మాట్లాడుతున్న తమ్ముడు రేషన్ […]
దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియా వేదికగా తెలుగుదేశం పార్టీ ఏపీ ప్రభుత్వం పై విమర్శలు, ఆరోపణలు చేసింది. తాజాగా టీడీపీ అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ.. ‘రాష్ట్రంలో హైకోర్టు ఆర్డర్ కే దిక్కులేదు. జాయింట్ కలెక్టర్‌కు హైకోర్టు ఆర్డర్ కన్నా వైసీపీ నాయకుల మాటే శిరోధార్యం అయిపోయింది. చట్టాన్ని అమలు చేయాల్సిన కలెక్టర్ ఇలా వైసీపీ ఎమ్మెల్యేకు బంట్రోతుగా వ్యవహరించడం దురదృష్టకరం. పలాస నియోజకవర్గం, మందస మండలం, చిక్కుడు గ్రామంలో వీడియోలో మాట్లాడుతున్న తమ్ముడు రేషన్ డిపోను స్థానిక ఎమ్మెల్యే వేరే వాళ్లకు ఇప్పించాడు. ఈ విషయమై హైకోర్టు నుండి ఆర్డర్ తెచ్చుకొని జాయింట్ కలెక్టర్ గారి చుట్టూ తిరుగుతున్నా, స్థానిక వైసీపీ ఎమ్మెల్యే వత్తిడి వలన జాయింట్ కలెక్టర్ వారి రేషన్ షాప్ వారికి వచ్చేటట్లు చర్యలు తీసుకొనలేకపోవటం అన్యాయం. ఇది ముమ్మాటికీ కోర్టు ధిక్కరణే. వెంటనే ఆ రేషన్ షాప్‌ను సంబంధిత వ్యక్తులకి అప్పచెప్పాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తోంది.’ అంటూ ఓ వీడియోను టీడీపీ అప్‌లోడ్ చేసింది.
రాష్ట్రంలో హైకోర్టు ఆర్డర్ కే దిక్కులేదు. జాయింట్ కలెక్టర్ కు హైకోర్టు ఆర్డర్ కన్నా వైసీపీ నాయకుల మాటే శిరోధార్యం అయిపోయింది. చట్టాన్ని అమలు చేయాల్సిన కలెక్టర్ ఇలా వైసీపీ ఎమ్మెల్యే కు బంట్రోతుగా వ్యవహరించడం దురదృష్టకరం.(1/4) pic.twitter.com/tuu6kZMAA6
— Telugu Desam Party #StayHomeSaveLives (@JaiTDP) November 18, 2020