టాటా స్కై.. ఫ్రీ ఆన్‌లైన్ క్లాసెస్
దిశ, వెబ్‌డెస్క్: స్కూల్స్ రీఓపెన్ అయ్యే విషయం పక్కనపెడితే.. విద్యార్థులు ఆన్‌లైన్ వేదికగా పాఠాలు వింటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే దేశంలోని విద్యార్థుల కోసం టాటా స్కై తన చందాదారులందరికీ ఉచిత ఆన్‌లైన్ తరగతులు అందించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ‘టాటా స్కై క్లాస్‌రూమ్’ ప్రాజెక్ట్‌లో భాగంగా 5-8వ తరగతుల విద్యార్థులకు మ్యాథ్స్, సైన్స్ పాఠాలు అందించనుంది. ఇందుకోసం 700కి పైగా యానిమేటెడ్ కాన్సెప్ట్ లెర్నింగ్ వీడియోలను రూపొందించగా, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మాత్రం వీటిని […]
దిశ, వెబ్‌డెస్క్: స్కూల్స్ రీఓపెన్ అయ్యే విషయం పక్కనపెడితే.. విద్యార్థులు ఆన్‌లైన్ వేదికగా పాఠాలు వింటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే దేశంలోని విద్యార్థుల కోసం టాటా స్కై తన చందాదారులందరికీ ఉచిత ఆన్‌లైన్ తరగతులు అందించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ‘టాటా స్కై క్లాస్‌రూమ్’ ప్రాజెక్ట్‌లో భాగంగా 5-8వ తరగతుల విద్యార్థులకు మ్యాథ్స్, సైన్స్ పాఠాలు అందించనుంది. ఇందుకోసం 700కి పైగా యానిమేటెడ్ కాన్సెప్ట్ లెర్నింగ్ వీడియోలను రూపొందించగా, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మాత్రం వీటిని అందిస్తోంది. వీడియో పాఠాలతో పాటు, ఎడ్యుకేషన్ గేమ్‌లు కూడా ప్రసారం చేస్తుండగా, ఈ క్లాస్ రూమ్ సర్వీస్ ప్రారంభించడానికి వినియోగదారులు తమ పిల్లలకు సరిపోయే గ్రేడ్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. కాగా 653 నెంబర్ చానల్‌లో టాటా స్కై క్లాస్‌రూమ్ పాఠాలను వినొచ్చు.