పాలనలో జోక్యం చేసుకుంటే ఇక సీఎం ఎందుకు: స్పీకర్ తమ్మినేని

రాష్ట్ర ఎన్నికల కమిషన్ పరిధి ప్రభుత్వానికి సూచనలు చేయడం వరకేనని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. శ్రీకాకుళంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడం, విధివిధానాలు అమలు చేయడం వరకే రాష్ట్ర ఎన్నికల కమిషన్ పాత్ర ఉంటుందని తెలిపారు. విపత్తులు ఏర్పడినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగంతో సంప్రదించి, ప్రభుత్వ సూచనల మేరకే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. ఇక్కడ మాత్రం ఎస్ఈసీ నిర్ణయం తీసుకుందని మండిపడ్డారు. పాలనలో ఎస్ఈసీ జోక్యం […]

Update: 2020-03-16 07:15 GMT

రాష్ట్ర ఎన్నికల కమిషన్ పరిధి ప్రభుత్వానికి సూచనలు చేయడం వరకేనని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. శ్రీకాకుళంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడం, విధివిధానాలు అమలు చేయడం వరకే రాష్ట్ర ఎన్నికల కమిషన్ పాత్ర ఉంటుందని తెలిపారు.

విపత్తులు ఏర్పడినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగంతో సంప్రదించి, ప్రభుత్వ సూచనల మేరకే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. ఇక్కడ మాత్రం ఎస్ఈసీ నిర్ణయం తీసుకుందని మండిపడ్డారు. పాలనలో ఎస్ఈసీ జోక్యం చేసుకుంటే ఇక రాష్ట్రానికి సీఎం ఎందుకని ఆయన ప్రశ్నించారు.

Tags : local body elections, speaker, tammineni, ysrcp, election commission, tammineni seetharam

Tags:    

Similar News