ఇండియన్ పాపులర్ ఫుడ్ జాబితాలో.. బిర్యానీ, సమోసా!

దిశ, ఫీచర్స్ : కోటి విద్యలు కూటి కొరకే అని ఊరికే అనలేదు. ఎంత సంపాదించినా, ఏ పని చేస్తున్నా తిండిని మాత్రం విస్మరించలేం. అదే రూల్ ఫాలో అవుతున్న నెటిజన్లు ‘ఫుడ్ యాప్స్’‌లో జోరుగా ఆర్డర్స్ పెడుతున్నారు. ఇక పాండమిక్ టైమ్‌లో ‘బిర్యానీ’పై తమ ప్రేమను చాటుకున్న ఇండియన్స్ ఈ టేస్టీ ఫుడ్‌కు టాప్ ప్లేస్ కట్టబెట్టారు. ఇదే క్రమంలో 2021లోనూ బిర్యానీనే అగ్రస్థానాన్ని ఆక్రమించుకోవడం విశేషం. గత ఆరేళ్లుగా స్విగ్గీ చార్ట్‌‌లో బిర్యానీ ఫస్ట్‌ […]

Update: 2021-12-22 02:08 GMT

దిశ, ఫీచర్స్ : కోటి విద్యలు కూటి కొరకే అని ఊరికే అనలేదు. ఎంత సంపాదించినా, ఏ పని చేస్తున్నా తిండిని మాత్రం విస్మరించలేం. అదే రూల్ ఫాలో అవుతున్న నెటిజన్లు ‘ఫుడ్ యాప్స్’‌లో జోరుగా ఆర్డర్స్ పెడుతున్నారు. ఇక పాండమిక్ టైమ్‌లో ‘బిర్యానీ’పై తమ ప్రేమను చాటుకున్న ఇండియన్స్ ఈ టేస్టీ ఫుడ్‌కు టాప్ ప్లేస్ కట్టబెట్టారు. ఇదే క్రమంలో 2021లోనూ బిర్యానీనే అగ్రస్థానాన్ని ఆక్రమించుకోవడం విశేషం. గత ఆరేళ్లుగా స్విగ్గీ చార్ట్‌‌లో బిర్యానీ ఫస్ట్‌ ప్లేస్‌లోనే కొనసాగుతుండగా.. 2021 ముగుస్తున్నందున స్విగ్గీ తాజాగా ఆరవ స్టాటిస్టిక్స్ (StatEATstics) నివేదికను విడుదల చేసింది.

ఈ మేరకు భారతీయులు నిమిషానికి 115 బిర్యానీలను ఆర్డర్ చేస్తుండగా, స్నాక్స్‌లో దేశీ సమోస 5 మిలియన్ ఆర్డర్స్‌తో టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఈ వరుసలో పావ్‌బాజీ 2.1 మిలియన్ ఆర్డర్స్‌తో రెండో స్థానంలో ఉంది. ఇక యాప్‌లో అత్యధికంగా ఆర్డర్ చేసిన డెజర్ట్‌గా ‘గులాబ్ జామూన్’ ఫస్ట్ ప్లేస్ దక్కించుకుంటే.. ‘రస్‌మలై’ రెండో స్థానానికి పరిమితమైంది. ఏదేమైనా 2021కి సంబంధించి స్విగ్గీలో హెల్తీ ఫుడ్ కోసం అన్వేషణ రెట్టింపయింది. కొవిడ్ తర్వాత జనాలు ఆరోగ్యంపై మరింత దృష్టి సారించారు. గతంతో పోలిస్తే దాదాపు 200% ఆర్డర్స్ పెరిగాయని నివేదిక పేర్కొంది. కాగా హైదరాబాద్, ముంబై తర్వాత బెంగళూరు అత్యంత ఆరోగ్య స్పృహ కలిగిన నగరంగా అవతరించింది. ప్లాట్‌ఫామ్‌లో కీటో ఆర్డర్స్ 23% పెరగ్గా, వేగన్ ఆర్డర్స్ కూడా 83% పెరిగాయి. పాన్ ఏషియన్, ఇండియన్, చైనీస్, మెక్సికన్, కొరియన్ టాప్ 5‌ స్థానాలు దక్కించుకున్నాయి.

చీజ్-గార్లిక్ బ్రెడ్, పాప్‌కార్న్, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి ఫుడ్ ఐటెమ్స్‌ను రాత్రి 10 గంటల తర్వాత అత్యధికంగా ఆర్డర్ చేసినట్లు స్విగ్గీ తెలిపింది. రాత్రి 7-9 గంటల మధ్య ఆర్డర్స్ రద్దీ ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది. చెన్నై, కోల్‌కతా, లక్నో, హైదరాబాద్‌లో చికెన్ బిర్యానీ అగ్రస్థానంలో ఉండగా, ముంబై అంతకు రెండింతల దాల్ కిచిడి ఆర్డర్ చేసింది.

Tags:    

Similar News