Purandeswari: అంబేద్కర్‌ను అన్ని విధాల అవమానించింది కాంగ్రెస్సే.. పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు
రాజ్యాంగ నిర్మాత, బీఆర్ అంబేద్కర్ (BR Ambedkar)ను అవమానపరిచింది కాంగ్రెస్ పార్టీ (Congress Party)నే అని ఏపీ బీజేపీ (BJP) అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి (Daggubati Purandeswari) ఆరోపించారు.
దిశ, వెబ్‌డెస్క్: రాజ్యాంగ నిర్మాత, బీఆర్ అంబేద్కర్ (BR Ambedkar)ను అవమానపరిచింది కాంగ్రెస్ పార్టీ (Congress Party)నే అని ఏపీ బీజేపీ (BJP) అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి (Daggubati Purandeswari) ఆరోపించారు. ఇవాళ ఆమె రాజమండ్రి (Rajahmundry)లో మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని మార్చేస్తున్నారంటూ కాంగ్రెస్ (Congress) నేతలు గతంలో బీజేపీ (BJP)పై దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. అంబేద్కర్ (Ambedkar) తమ నాయకుడిని చెబుతోన్న కాంగ్రెస్.. ఆయనకు భారతరత్న (Bharat Ratna) ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని ప్రశ్నించారు.
అటల్ బిహారీ వాజ్‌పేయ్ (Atal Bihari Vajpayee) ప్రభుత్వం వచ్చాక ఆయనకు భారతరత్న (Bharat Ratna) ఇచ్చి గౌరవించామని పేర్కొన్నారు. భారత రాజ్యాంగాన్ని, అంబేద్కర్‌ను బీజేపీ (BJP) ఏనాడు అగౌరవపరిచలేదని స్పష్టం చేశారు. రాజ్యాంగాన్ని కూడా తాము ఎన్నడూ ఉల్లంఘించి ప్రవర్తించలేదని గుర్తు చేశారు. విధివిధానాలు రూపొందించాకే పార్లమెంటు (Parliament)లో జమిలి ఎన్నికల బిల్లు (Jamili Election Bill)ను తీసుకొచ్చామని తెలిపారు. అల్లు అర్జున్ (Allu Arjun) అరెస్ట్ విషయంలో సమగ్ర విచారణ జరిగిన తరువాతే చర్యలు తీసుకోవాలని అన్నారు. తొక్కిసలాట జరిగిన ప్రాంతంలో పోలీస్ సెక్యూరిటీ సరిగా లేదని పురందేశ్వరి అన్నారు.