BJP: రేపే బీజేపీలోకి ప్రముఖ వ్యక్తి.. ఏర్పాట్లు పూర్తి

విశాఖ డెయిరీ(Visakha Dairy) చైర్మన్ ఆడారి ఆనంద్(Adari Anand) వైసీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

Update: 2024-12-24 12:06 GMT

దిశ, వెబ్‌డెస్క్: విశాఖ డెయిరీ(Visakha Dairy) చైర్మన్ ఆడారి ఆనంద్(Adari Anand) వైసీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. వ్యక్తిగత కారణాలతో వైసీపీ(YCP) ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు అడారి ఆనంద్ కుమార్ తెలిపారు. అడారి ఆనంద్ కుమార్‌తో పాటు పలువురు డైరెక్టర్లు కూడా వైసీపీకి రాజీనామా చేశారు. తాజాగా వీరు కీలక నిర్ణయం తీసుకున్నారు. బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. రేపు రాజమండ్రి వేదికగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ పురంధేశ్వరి(Purandeswari) సమక్షంలో బీజేపీ(BJP) తీర్థం పుచ్చుకోబోతున్నారు.

ఇదిలా ఉండగా.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అడారి ఆనంద్ వైసీపీ తరుపున విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థి గణబాబు విజయం సాధించారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న అడారి ఆనంద్.. వైసీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు.

Also Read..

TTD News : టీటీడీ మరో కీలక నిర్ణయం

Tags:    

Similar News