Pawan Kalyan: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan ) ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు.
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan ) ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా(X) వేదికగా తెలియజేశారు. గుడివాడ నియోజకవర్గం(Gudivada Constituency)లోని 44 గ్రామాల ప్రజలు కలుషిత నీటి ఇబ్బందులు పరిష్కరించాలని పవన్ కల్యాణ్‌కు అక్కడి స్థానిక ఎమ్మెల్యే వెనిగండ్ల రాము(Venigandla Ramu) విజ్ఞప్తి చేశారు. దీంతో వెంటనే స్పందించిన పవన్ కల్యాణ్.. యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. దీంతో 40 ఫిల్టర్ బెడ్లను మార్చి, కాలుష్య రహిత, స్వచ్ఛమైన రక్షిత తాగునీరు అందించేందుకు గ్రామీణ నీటి సరఫరా శాఖ విభాగం పనులు ప్రారంభించింది. ఈ పనులను సోమవారం స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పరిశీలించి, జనవరి 2025 నాటికి 44 గ్రామాలకు తాగునీటి కష్టాలు తీర్చాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Also Read...