Shyam Benegal : అధికారిక లాంఛనాలతో శ్యామ్ బెనెగల్‌ అంత్యక్రియలు

భారతీయ ప్రముఖ సినీ దర్శకుడు (Film Maker) శ్యామ్‌ బెనెగల్‌ (Shyam Benegal) అంత్యక్రియలు ప్రభహుత్వ అధికారిక లాంఛనాలతో ముగిశాయి.

Update: 2024-12-24 12:10 GMT

దిశ, వెబ్ డెస్క్ : భారతీయ ప్రముఖ సినీ దర్శకుడు (Film Maker) శ్యామ్‌ బెనెగల్‌ (Shyam Benegal) అంత్యక్రియలు ప్రభహుత్వ అధికారిక లాంఛనాలతో ముగిశాయి. మహారాష్ట్ర రాజధాని ముంబైలోని శివాజీ పార్క్‌ (Shivaji Park) ఎలక్ట్రిక్‌ క్రిమటేరియంలో అంత్యక్రియలు నిర్వహించారు. శ్యామ్‌ బెనెగల్‌ కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, అభిమానులు భారీ సంఖ్యలో అంత్యక్రియలకు హాజరయ్యారు. లెజెండరీ డైరెక్టర్ శ్యామ్‌ బెనెగల్‌ కిడ్నీ సంబంధ అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం మరణించిన విషయం తెలిసిందే.

1934లో హైద‌రాబాద్ రాష్ట్రంలోని తిరుమ‌ల‌గిరిలో శ్యామ్ బెనెగ‌ల్ జ‌న్మించారు. శ్యామ్‌ బెనెగల్‌ సికింద్రాబాద్ ప్రభుత్వ కాలేజీలో డిగ్రీ చ‌దివారు. ఉస్మానియా యూనివ‌ర్సిటీ నుంచి ఎంఏ ఎక‌నామిక్స్ ప‌ట్టా పొందారు. సామాజిక స‌మ‌స్యలు, ఆర్థిక అస‌మాన‌త‌ల‌పై ఆయ‌న సినిమాలు రూపొందించారు. ఎనిమిది సార్లు జాతీయ అవార్డులు అందుకున్నారు. బెనెగ‌ల్‌కు అంకూర్ (1974), నిషాంత్ (1975), మంత‌న్ (1976), భూమిక ‌(1977), జునూన్ (1978) సినిమాలు బాగా పేరు తెచ్చిపెట్టాయి. జాతీయ సినిమా అవార్డులలో హిందీ కేటగిరీలో శ్యామ్‌ బెనెగల్‌ ఏకంగా ఏడుసార్లు అత్యుత్తమ సినిమా అవార్డులు అందుకున్నారు. సినీ రంగానికి ఆయన చేసిన సేవలకుగాను ప‌ద్మ శ్రీ, ప‌ద్మభూష‌ణ్‌, దాదా సాహెబ్ ఫాల్కే, ఏఎన్ఆర్ జాతీయ అవార్డుల‌ను అందుకున్నారు. 

Also Read..

AP News : చింతమనేని ప్రభాకర్ ఆలోచన భేష్

Tags:    

Similar News