UGC-NET: యూజీసీ- నెట్ ఎగ్జామ్ సెంటర్ వివరాలు విడుదల.. ఇలా తెలుసుకోండి..

జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్(JRF), పీహెచ్డీ(Phd), అసిస్టెంట్ ప్రొఫెసర్ల(AP) నియామకం కోసం నిర్వహించే యూజీసీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్- 2024(UGC-NET) ఎగ్జామ్స్ వచ్చే ఏడాది జనవరి 3 నుంచి 16 వరకు జరుగనున్న విషయం తెలిసిందే.

Update: 2024-12-24 17:24 GMT

దిశ, వెబ్‌డెస్క్: జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్(JRF), పీహెచ్డీ(Phd), అసిస్టెంట్ ప్రొఫెసర్ల(AP) నియామకం కోసం నిర్వహించే యూజీసీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్- 2024(UGC-NET) ఎగ్జామ్స్ వచ్చే ఏడాది జనవరి 3 నుంచి 16 వరకు జరుగనున్న విషయం తెలిసిందే. మొత్తం రెండు సెషన్లలో ఈ పరీక్షలు నిర్వహించనుండగా.. సెషన్-1 ఎగ్జామ్స్ ఉదయం 9-12 వరకు, సెషన్-2 ఎగ్జామ్స్ మధ్యాహ్నం 3-6 వరకు జరగనున్నాయి. మొత్తం 85 సబ్జెక్టుల్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(CBT) విధానంలో ఈ పరీక్షలను కండక్ట్ చేయనున్నారు. ఇదిలా ఉంటే.. ఈ ఎగ్జామ్స్ కు సంబంధించింది సిటీ సెంటర్(City Center) వివరాలు మంగళవారం రిలీజ్ అయ్యాయి. పరీక్షకు అప్లై చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://ugcnet.nta.ac.in/ లో అప్లికేషన్ నంబర్(Application No), డేట్ ఆఫ్ బర్త్(DOB), సెక్యూరిటీ పిన్(Security Pin) డీటెయిల్స్ ఎంటర్ చేసి ఎగ్జామ్ సెంటర్ వివరాలను తెలుసుకోవచ్చు. త్వరలో అడ్మిట్ కార్డులను విడుదల చేయనున్నారు. కాగా ఈ పరీక్షలో ఉతీర్ణత సాధించాలంటే జనరల్ కేటగిరీ వాళ్లు 40 శాతం, ఓబీసీ/ SC/ST అభ్యర్థులు 35 శాతం మార్కులు సాధించాలి. పూర్తి వివరాలకు అభ్యర్థులు వెబ్‌సైట్ ను సందర్శించగలరు.

Tags:    

Similar News