Pakistan: అఫ్గాన్ పై పాక్ వైమానిక దాడులు.. 15 మంది మృతి

అఫ్గానిస్థాన్(Afghanistan) పై పాకిస్థాన్(Pakistan) ఉగ్రదాడికి పాల్పడింది. వైమానిక దాడులతో అఫ్గాన్ కరాచీ విరుచుకుపడింది.

Update: 2024-12-25 04:38 GMT

దిశ, నేషనల్ బ్యూరో: అఫ్గానిస్థాన్(Afghanistan) పై పాకిస్థాన్(Pakistan) ఉగ్రదాడికి పాల్పడింది. వైమానిక దాడులతో అఫ్గాన్ కరాచీ విరుచుకుపడింది. మంగళవారం అర్ధరాత్రి ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ చేసిన ఈ వైమానిక(Pakistan's airstrikes) దాడిలో ఇప్పటివరకు 15 మంది మరణించారు. వీరిలో చాలా మంది మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. అయితే, అఫ్గాన్ లో తలదాచుకున్న పాకిస్థానీ తెహ్రీక్-ఏ-తాలిబాన్ ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని సరిహద్దులోని పక్తికా ప్రావిన్స్‌లోని పర్వత ప్రాంతంలో దాడులు జరిగినట్లు అధికారులు తెలిపారు. లామన్‌తో సహా ఏడు గ్రామాలను లక్ష్యంగా చేసుకున్నామన్నారు. కాగా.. ఆఫ్గాన్ లోని అనేక ప్రాంతాల్లో అనుమానిత పాకిస్థానీ తాలిబాన్ లక్ష్యాలను లక్ష్యంగా చేసుకున్నట్లు భద్రతా అధికారులు తెలిపారు. ఆ శిక్షణా కేంద్రాలలో ఒకదానిని పూర్తిగా ధ్వంసం చేసిందన్నారు. కొంతమంది తిరుగుబాటుదారులను చంపిందన్నారు. వైమానిక దాడికి పాకిస్థాన్ జెట్ విమానాలను ఉపయోగించినట్లు తెలుస్తోంది. కాగా.. ఈ వైమానిక దాడి తర్వాత భారీ నష్టం జరిగింది. ఆ ప్రాంతంలో మరింత ఉద్రిక్తత పెరిగే అవకాశం ఉంది. ఈ ఏడాది మార్చి తర్వాత పాకిస్థాన్ తాలిబాన్ స్థావరాలపై కరాచీ దాడి చేయడం ఇది రెండోసారి.

దాడులను ఖండించిన అఫ్గాన్

మరోవైపు, తాలిబాన్ రక్షణ మంత్రిత్వ శాఖ(Taliban's Defence Ministry) పాకిస్థాన్ వైమానిక దాడులను ఖండించింది. అఫ్గాన్ పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు పేర్కొంది. ఎక్కువ మంది వజీరిస్థాన్ ప్రాంతానికి చెందిన శరణార్థులేనని పేర్కొంది. ఈదాడి అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన, క్రూరమైన చర్య అని అఫ్గాన్ పేర్కొంది. వైమానిక దాడులను "పిరికిపంద చర్య"గా పేర్కొన్న అఫ్గాన్ మంత్రిత్వ శాఖ.. పాక్ "ఏకపక్ష వైమానిక దాడులు" ఏ సమస్యకు పరిష్కారం కాదని అన్నారు. పాక్ ప్రత్యేక ప్రతినిధి మహ్మద్ సాదిక్ కాబూల్‌లో తాలిబాన్లతో సత్సంబంధాలు పెంపొందించే దిశగా చర్చలు జరిపిన కొన్ని గంటల తర్వాత దాడులు జరగడం గమనార్హం.

Tags:    

Similar News