Allu Arjun : విచారణకు అల్లు అర్జున్.. ఆ ప్రాంతంలో పోలీసుల ఆంక్షలు

సంధ్య థియేటర్ తొక్కిసలాట(Stampede) ఘటనలో ఏ11 గా ఉన్న హీరో అల్లు అర్జున్(Allu Arjun) కు సోమవారం సాయంత్రం చిక్కడపల్లి పోలీసులు(Chikkadapally Police) నోటీసులు(Notices) జారీ చేశారు.

Update: 2024-12-24 05:03 GMT

దిశ, వెబ్‌డెస్క్: సంధ్య థియేటర్ తొక్కిసలాట(Stampede) ఘటనలో ఏ11 గా ఉన్న హీరో అల్లు అర్జున్(Allu Arjun) కు సోమవారం సాయంత్రం చిక్కడపల్లి పోలీసులు(Chikkadapally Police) నోటీసులు(Notices) జారీ చేశారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు విచారణ(investigation)కు హాజరు కావాలని నోటీసులు ఇవ్వగా.. రాత్రి మొత్తం తన లీగ్ టీం తో అల్లు అర్జున్ చర్చించారు. అయితే మరికొద్ది సేపట్లో హీరో విచారణకు పోలీస్ స్టేషన్ కు వస్తున్నారని సమాచారం అందడంతో.. చిక్కడపల్లి పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఆంక్షలు(Sanctions) విధించారు. స్టేషన్ రూట్‌కు వాహనాల రాకపోకలను నిలిపివేశారు. పోలీస్‌ స్టేషన్‌కు 200 మీటర్ల దూరం నుంచి ఆంక్షలు అలులోకి తీసుకొచ్చారు. అల్లు అర్జున్(Allu Arjun) స్టేషన్ కు వస్తే ఆయనను చూసేందుకు, మద్దతు తెలిపేందుకు భారీ ఎత్తున అభిమానులు వచ్చే అవకాశం ఉండటంతో స్టేషన్ పరిధిలో ఈ ఆంక్షలు పెట్టినట్లు పోలీసులు తెలుపుతున్నారు. అలాగే అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి(Kancharla Chandrasekhar Reddy) తన ఇంటికి చేరుకున్నట్లు తెలుస్తుంది.

Tags:    

Similar News