Big Shock: మావోయిస్టులకు మరో బిగ్ షాక్.. 62 అడుగుల స్మారక స్థూపం నేలమట్టం
ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh)లో కాల్పుల మోత మోగుతూనే ఉంది.
దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh)లో కాల్పుల మోత మోగుతూనే ఉంది. ఇటీవల మావోయిస్టులు (Maoists), భద్రత బలగాల (Security forces) మధ్య వరుసగా ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఆ కాల్పుల్లో ఇప్పటికే చాలామంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఉనికి ప్రశ్నార్థకం అవుతోన్న వేళ వారికి మరో బిగ్ షాక్ తగిలింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం (Chhattisgarh State))లోని బీజాపూర్ (Bijapur) జిల్లాలో ఉన్న మావోయిస్టుల 62 అడుగుల స్మారక స్థూపాన్ని భద్రత బలగాలు నెలమట్టం చేశాయి. వారి అడ్డగా పిలువబడే టార్రెమ్ పోలీస్ స్టేషన్ (Tarrem Police Station) పరిధిలోని కోమట్‌పల్లి (Komatpally)లో ఈ ఘటన చోటుచేసుకుంది.