రైలు పట్టాలపై యువకుడి డెడ్‌బాడీ.. చనిపోయాడా? చంపేశారా?

దిశ, గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఎన్టీపీసీ చైతన్యపురి కాలనీలోని రైల్వే ట్రాక్ శివారు ప్రాంతంలో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే… చైతన్యపురి కాలనీకి చెందిన దాట్ల రాజ్ కుమార్ (26) అనే యువకుడు రైల్వే పట్టాలపై పడి మృతి చెంది ఉన్నాడు. మృతుడి కాళ్లు చేతులు విరిగిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఇది హత్యనా..? ఆత్మహత్యనా..? అనే కోణంలో […]

Update: 2021-11-11 23:39 GMT

దిశ, గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఎన్టీపీసీ చైతన్యపురి కాలనీలోని రైల్వే ట్రాక్ శివారు ప్రాంతంలో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే… చైతన్యపురి కాలనీకి చెందిన దాట్ల రాజ్ కుమార్ (26) అనే యువకుడు రైల్వే పట్టాలపై పడి మృతి చెంది ఉన్నాడు. మృతుడి కాళ్లు చేతులు విరిగిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఇది హత్యనా..? ఆత్మహత్యనా..? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.

Tags:    

Similar News