టీఆర్ఎస్ సర్పంచుల సస్పెన్షన్.. అధికార పార్టీలో దుమారం

దిశ , మర్రిగూడ: అధికార టీఆర్ఎస్‌ పార్టీ ఏకపక్ష నిర్ణయాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆ పార్టీ సర్పంచులు, ఉప సర్పంచులు రోడ్డెక్కి నిరసన తెలిపారు. ఈ సంఘటన నాంపల్లి మండల కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. ఆదివారం జరిగిన టీఆర్ఎస్ మండల పార్టీ సమావేశంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ సుంకిశాల సర్పంచ్ బుషిపాక రాములుతో పాటు తుంగపాడు గౌరారంకు చెందిన ఏడుకొండలను మండల పార్టీ అధ్యక్షుడు సస్పెండ్ చేశారు. కొందరు సర్పంచులను మాత్రమే వేదికపైకి […]

Update: 2021-10-26 04:29 GMT

దిశ , మర్రిగూడ: అధికార టీఆర్ఎస్‌ పార్టీ ఏకపక్ష నిర్ణయాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆ పార్టీ సర్పంచులు, ఉప సర్పంచులు రోడ్డెక్కి నిరసన తెలిపారు. ఈ సంఘటన నాంపల్లి మండల కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. ఆదివారం జరిగిన టీఆర్ఎస్ మండల పార్టీ సమావేశంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ సుంకిశాల సర్పంచ్ బుషిపాక రాములుతో పాటు తుంగపాడు గౌరారంకు చెందిన ఏడుకొండలను మండల పార్టీ అధ్యక్షుడు సస్పెండ్ చేశారు.

కొందరు సర్పంచులను మాత్రమే వేదికపైకి ఆహ్వానించి.. తమను వేదికపైకి ఆహ్వానించలేదని బాధిత సర్పంచ్‌లు మండిపడ్డారు. ఇందేంటని అడిగితే ఏకపక్షంగా ఎలాంటి నోటీసు ఇవ్వకుండా సస్పెండ్ చేయడం ఏమిటన్నారు. ఈ నేపథ్యంలోనే మండల అధ్యక్షుడి తీరును నిరసిస్తూ.. మంగళవారం నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద అధికార పార్టీకి చెందిన సర్పంచులు, ఉప సర్పంచులు దళిత బహుజన సంఘాలను కలుపుకొని పార్టీ అధ్యక్షుడి నిర్ణయాన్ని నిరసిస్తూ ధర్నా చేపట్టారు. దీంతో మండల వ్యాప్తంగా రాజకీయ దుమారమే చెలరేగింది.

Tags:    

Similar News