రెండు లిక్కర్ షాపులకు సస్పెన్షన్ నోటీసులు  

దిశ, నల్గొండ: యాదాద్రి భువనగిరి జిల్లాలో మద్యం నియంత్రణలో భాగంగా నిబంధనలను అతిక్రమించిన రెండు మద్యం షాపులకు సస్పెన్షన్ నోటీసులు అందజేసినట్లు ఎక్సైజ్ ఈ.ఎస్ కృష్ణప్రియ తెలిపారు. శనివారం భువనగిరిలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో మార్చి 22న జిల్లాలోని 67 వైన్ షాపులు, నాలుగు బార్లను సీల్‌వేసి మూసివేయడం జరిగిందన్నారు. యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలో లక్ష్మి మత్స్యగిరి వైన్ షాపు సీల్ వేసినప్పటికీ షాపు తెరిచి మద్యం […]

Update: 2020-04-11 02:15 GMT

దిశ, నల్గొండ: యాదాద్రి భువనగిరి జిల్లాలో మద్యం నియంత్రణలో భాగంగా నిబంధనలను అతిక్రమించిన రెండు మద్యం షాపులకు సస్పెన్షన్ నోటీసులు అందజేసినట్లు ఎక్సైజ్ ఈ.ఎస్ కృష్ణప్రియ తెలిపారు. శనివారం భువనగిరిలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో మార్చి 22న జిల్లాలోని 67 వైన్ షాపులు, నాలుగు బార్లను సీల్‌వేసి మూసివేయడం జరిగిందన్నారు.

యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలో లక్ష్మి మత్స్యగిరి వైన్ షాపు సీల్ వేసినప్పటికీ షాపు తెరిచి మద్యం అమ్మకాలు నిర్వహించినందుకు షాపు యజమానిపై కేసు నమోదు చేసినట్లు ఆమె తెలిపారు. ఇందులో భాగంగా నాలుగు కాటన్‌ల మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. అటు చౌటుప్పల్ మండలంలోని నేలపట్ల గ్రామంలో సాయి దుర్గ వైన్స్ నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఆ వైన్ షాపు నుంచి ఏడు కాటన్‌ల మద్యం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అలాగే, జిల్లాలోని 11 బెల్టు షాపులపై దాడులు నిర్వహించి కేసులు నమోదు చేశామని ఆమె స్పష్టం చేశారు.

Tags: Suspension Notices, Two Liquor Shops, yadadri bhuvanagiri

Tags:    

Similar News