భూమా అఖిల ప్రెగ్నెంట్.. బెయిల్‌పై ఉత్కంఠ

దిశ, వెబ్‌డెస్క్: బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో అరెస్ట్ అయిన మాజీ మంత్రి భూమా అఖిల ప్రియకు 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో ఆమెను బుధవారం రాత్రి చంచల్ గూడ జైలుకు తరలించారు. కాగా, అఖిల ప్రియ తరపు న్యాయవాదులు సికింద్రాబాద్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. నేడు బెయిల్ పిటిషన్‌పై వాదనలు జరగనున్నాయి. అయితే భూమా అఖిల ప్రియ గర్భవతి కావడంతో బెయిల్‌పై ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం భూమా […]

Update: 2021-01-07 01:50 GMT

దిశ, వెబ్‌డెస్క్: బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో అరెస్ట్ అయిన మాజీ మంత్రి భూమా అఖిల ప్రియకు 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో ఆమెను బుధవారం రాత్రి చంచల్ గూడ జైలుకు తరలించారు. కాగా, అఖిల ప్రియ తరపు న్యాయవాదులు సికింద్రాబాద్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. నేడు బెయిల్ పిటిషన్‌పై వాదనలు జరగనున్నాయి. అయితే భూమా అఖిల ప్రియ గర్భవతి కావడంతో బెయిల్‌పై ఉత్కంఠ నెలకొంది.

ప్రస్తుతం భూమా అఖిల ప్రియ చంచల్‌గూడ మహిళా జైలులో అధికారులు అబ్జర్వేషన్‌లో ఉంచారు. అయితే గత రాత్రి జైలుకు తీసుకువచ్చిన తర్వాత ఏమి తినలేదని.. కొంత అనారోగ్యంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇవాళ ఉదయం లేచిన తర్వాత అఖిలప్రియ జ్యూస్ మాత్రమే తాగారని చెప్పారు. కరోనా నిబంధనల నేపథ్యంలో అఖిల ప్రియను సింగిల్ బ్యారక్‌లో ఉంచినట్లు తెలిపారు. ఆమె అనారోగ్య సమస్య, గర్భవతి కావడంతో బెయిల్‌పై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్ ఇంకా పరారీలోనే ఉన్నారు. భార్గవ్ రామ్ ఆచూకీ కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నారు.

Tags:    

Similar News