ఏపీ పరీక్షల నిర్వహణపై సుప్రీకోర్టు ఆగ్రహం

దిశ,వెబ్‌డెస్క్ : పదవ తరగతి, ఇంటర్  పరీక్షల నిర్వహణలో ఏపీ ప్రభుత్వం ధాఖలు చేసిన అఫిడవిట్‌పై ఈరోజు సుప్రీం కోర్టులో విచారణ కొనసాగింది.  జూలై చివరిలో పరీక్షల నిర్వహించాలని అఫిడవిట్‌లో  చెప్పారన్నారు, కానీ అఫిడవిట్‌లో పక్కా సమాచారం లేదని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. 15 రోజుల్లోగా పరీక్షల టైంటేబుల్ ఇస్తామని చెప్పి ఇప్పుడు 15 రోజులు ఎలా సరిపోతాయని సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పరీక్షల సిబ్బంది, నిర్వహణకు సంబంధించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదని, ప్రభుత్వమే అన్ని రకాల […]

Update: 2021-06-24 01:25 GMT

దిశ,వెబ్‌డెస్క్ : పదవ తరగతి, ఇంటర్ పరీక్షల నిర్వహణలో ఏపీ ప్రభుత్వం ధాఖలు చేసిన అఫిడవిట్‌పై ఈరోజు సుప్రీం కోర్టులో విచారణ కొనసాగింది. జూలై చివరిలో పరీక్షల నిర్వహించాలని అఫిడవిట్‌లో చెప్పారన్నారు, కానీ అఫిడవిట్‌లో పక్కా సమాచారం లేదని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. 15 రోజుల్లోగా పరీక్షల టైంటేబుల్ ఇస్తామని చెప్పి ఇప్పుడు 15 రోజులు ఎలా సరిపోతాయని సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పరీక్షల సిబ్బంది, నిర్వహణకు సంబంధించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదని, ప్రభుత్వమే అన్ని రకాల లాజిస్టిక్ వసతులు కల్పించాలని ఆదేశించింది. అలానే ఏపీ ప్రభుత్వం నుంచి కోర్టు సమగ్ర నివేదికను కోరింది. మళ్లీ విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది.

Tags:    

Similar News