పేషెంట్లతో మర్యాదగా మాట్లాడండి : సూపరింటెండెంట్

దిశ, గోదావరిఖని: ఆసుపత్రి అభివృద్ధికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కంది శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ మేరకు బుధవారం ఆసుపత్రిలో డాక్టర్లు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిరోజు ఆసుపత్రికి సుమారుగా 600 మంది వరకు ఓపీ విభాగానికి సంబంధించిన పేషెంట్లు వస్తున్నారని తెలిపారు. మెడికల్ కాలేజీ ప్రారంభమయ్యే వరకు కనీసం వెయ్యికి పైగా ఓపీ పేషెంట్లు వచ్చేలా చూడాలని సిబ్బందికి సూచించారు. అలాగే […]

Update: 2021-12-15 05:40 GMT

దిశ, గోదావరిఖని: ఆసుపత్రి అభివృద్ధికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కంది శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ మేరకు బుధవారం ఆసుపత్రిలో డాక్టర్లు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిరోజు ఆసుపత్రికి సుమారుగా 600 మంది వరకు ఓపీ విభాగానికి సంబంధించిన పేషెంట్లు వస్తున్నారని తెలిపారు. మెడికల్ కాలేజీ ప్రారంభమయ్యే వరకు కనీసం వెయ్యికి పైగా ఓపీ పేషెంట్లు వచ్చేలా చూడాలని సిబ్బందికి సూచించారు. అలాగే ఆసుపత్రిలో శానిటేషన్ మరింత మెరుగుపర్చాలని ఎప్పటికప్పుడు ఆసుపత్రిని శుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. పేషెంట్ల పట్ల మర్యాదగా ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో ఆసుపత్రి డాక్టర్లు, నర్సులు, సిబ్బంది పాల్గొన్నారు.

Tags:    

Similar News