భూ రిజిస్ట్రేషన్‌లో ప్రతిష్టంభన…
దిశ,జగిత్యాల: కరోనా సెకండ్ వేవ్ ఉదృతంగా మారుతున్న నేపథ్యంలో కరోనా కట్టడికి రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్ లో భూ, ఇళ్ల రిజిస్ట్రేషన్ పనులు నిలిపివేశారు. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను మరోసారి పొడగించడంతో భూ, ఇళ్ల రిజిస్ట్రేషన్ల పక్రియను కొనసాగించాలని, ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆ శాఖ భూ, ఇళ్ల రిజిస్ట్రేషన్లకు అన్ని ఏర్పాట్లు చేసుకుంది. అయితే తొలి రోజు సోమవారం స్లాట్ బుకింగ్‌లో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా భూ రిజిస్ట్రేషన్లలో […]
దిశ,జగిత్యాల: కరోనా సెకండ్ వేవ్ ఉదృతంగా మారుతున్న నేపథ్యంలో కరోనా కట్టడికి రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్ లో భూ, ఇళ్ల రిజిస్ట్రేషన్ పనులు నిలిపివేశారు. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను మరోసారి పొడగించడంతో భూ, ఇళ్ల రిజిస్ట్రేషన్ల పక్రియను కొనసాగించాలని, ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆ శాఖ భూ, ఇళ్ల రిజిస్ట్రేషన్లకు అన్ని ఏర్పాట్లు చేసుకుంది. అయితే తొలి రోజు సోమవారం స్లాట్ బుకింగ్‌లో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా భూ రిజిస్ట్రేషన్లలో ప్రతిష్టంభన నెలకొంది. లాక్‌డౌన్ తరువాత ప్రారంభమైన రోజే జగిత్యాల సబ్ రిజిస్టార్ కార్యాలయంలో కొన్ని రిజిస్ట్రేషన్లు అయిన తరువాత సర్వర్ లో సాంకేతిక సమస్య తలెత్తిన కారణంగా కొనుగోలుకు స్లాట్ బుకింగ్ లు కాలేదని సిబ్బంది తెలిపారు.
స్లాట్ బుక్ చేసుకోవాలి..
స్లాట్ బుకింగ్ చేసుకుంటే రిజిస్ట్రేషన్లు చేస్తామని జగిత్యాల సబ్ రిజిస్టార్ కిషన్ నాయక్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు తాము కార్యాలయాలు తెరిచామని, అయితే స్లాట్ బుకింగ్ చేసుకొని వస్తే రిజిస్ట్రేషన్ల చేయడం జరుగుతుందని వెల్లడించారు. ప్రభుత్వం ఇచ్చిన ఈ వెసులుబాటును భూ, ఇళ్ల కొనుగోలు, విక్రయదారులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అయితే స్లాట్ బుకింగ్‌లో ఒక్కో ఆఫీసుకు ప్రభుత్వం కొన్ని పరిమితులు విధించిందన్నారు. అయితే కొన్ని రిజిస్ట్రేషన్లు చేయడం జరిగిందని, దాని ద్వారా రెండు లక్షల పై చిలుకు ఆదాయం ప్రభుత్వ ఖజానాకు చేరిందని అన్నారు. కొవిడ్ నిబంధనల ప్రకారం కార్యాలయం లోకి కొందరినే అనుమతిస్తున్నామని, రిజిస్ట్రేషన్ కోసం వచ్చే వారు తప్పనిసరి కొవిడ్ నియమాలను పాటించాలన్నారు.