బతికుండగానే చంపేశారు…
దిశ ప్రతినిధి, కరీంనగర్: చత్తీస్ గఢ్ బిలాయ్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బతికుండగానే కరోనా బాధితుడు చనిపోయాడంటూ బంధువుకుల సమాచారం ఇచ్చారు. శ్మశాన వాటికకు తరలించిన తరువాత అనుమానించిన కుటుంబ సభ్యులు సిబ్బందిపై ఒత్తిడి చేసి అతని ముఖాన్ని చూపించాలని పట్టుపట్టారు. దీంతో ఆశవర్కర్ పాలథిన్ కవర్ ను తొలగించడంతో అసలు విషయం బయటపడింది. ఆసుపత్రి వర్గాలు చనిపోయాడన్న వ్యక్తి బతికున్నట్టుగా గమనించారు. దీంతో అతన్ని ప్యాక్ చేసిన […]
దిశ ప్రతినిధి, కరీంనగర్: చత్తీస్ గఢ్ బిలాయ్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బతికుండగానే కరోనా బాధితుడు చనిపోయాడంటూ బంధువుకుల సమాచారం ఇచ్చారు. శ్మశాన వాటికకు తరలించిన తరువాత అనుమానించిన కుటుంబ సభ్యులు సిబ్బందిపై ఒత్తిడి చేసి అతని ముఖాన్ని చూపించాలని పట్టుపట్టారు. దీంతో ఆశవర్కర్ పాలథిన్ కవర్ ను తొలగించడంతో అసలు విషయం బయటపడింది. ఆసుపత్రి వర్గాలు చనిపోయాడన్న వ్యక్తి బతికున్నట్టుగా గమనించారు. దీంతో అతన్ని ప్యాక్ చేసిన కవర్ తొలగించచడంతో కరోనా బాదితుడు సజీవంగా బయటకు వచ్చాడు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు ఆసుపత్రిని ధ్వంసం చేశారు.