ఎవరైనా రోడ్డుపై కనిపిస్తే చాలు.. రక్తం కళ్లచూడాల్సిందే..!

దిశ, జగిత్యాల ; జగిత్యాల పట్టణం 12వ వార్డు (గాంధీనగర్)లో ఆదివారం ఉదయం వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి. ఒక్కసారిగా స్థానికులపై దాడి చేయడంతో పేదలు, చిన్నారులు పలువురికి గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు వారిని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చి వైద్యం చేయించారు. కాగా ఇటీవల వీధి కుక్కల బెడద ఎక్కువ అయ్యింది. రాత్రి పూత రోడ్ల వెంట వెళ్లేందుకు ప్రజలు జంకుతున్నారు. దాదాపు అన్ని వార్డుల్లో కుక్కల బెడద ఉందని, గత రెండు నెలల […]

Update: 2021-10-24 05:42 GMT

దిశ, జగిత్యాల ; జగిత్యాల పట్టణం 12వ వార్డు (గాంధీనగర్)లో ఆదివారం ఉదయం వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి. ఒక్కసారిగా స్థానికులపై దాడి చేయడంతో పేదలు, చిన్నారులు పలువురికి గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు వారిని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చి వైద్యం చేయించారు. కాగా ఇటీవల వీధి కుక్కల బెడద ఎక్కువ అయ్యింది.

రాత్రి పూత రోడ్ల వెంట వెళ్లేందుకు ప్రజలు జంకుతున్నారు. దాదాపు అన్ని వార్డుల్లో కుక్కల బెడద ఉందని, గత రెండు నెలల కిందట పలు వార్డులలో శునకాలు కొందరిపై దాడులు చేశాయి. గత 5 ,6 నెలల నుండి ప్రజల నుండి ఫిర్యాదులు వస్తున్న మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని ఎత్తున ఆరోపణలు వినవస్తున్నాయి. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు మొద్దు నిద్ర వీడీ కుక్కల బెడద నివారణకు చర్యలు తీసుకోవాలని జగిత్యాల పట్టణ ప్రజలు కోరుతున్నారు.

Tags:    

Similar News