స్పాటిఫై ర్యాప్‌డ్ 2020.. మీ ఫేవరెట్ ఏంటి?

దిశ, వెబ్‌డెస్క్ : డిసెంబర్ వచ్చిందంటే చాలు.. గత పదకొండు నెలల్లో ఏమేం చేశామనే దాని గురించి యాప్‌‌లు రివ్యూలు మొదలుపెడతాయి. నిజానికి ఈ 2020లో గత పదకొండు నెలల్లో పెద్దగా పొడిచిందేమీ లేదు. కానీ పాటలు వినడానికి మాత్రం కావాల్సినంత సమయం దొరికింది. అందుకే మ్యూజిక్ యాప్‌లకు రివ్యూలు చేసుకునే అవకాశం దొరికింది. ఈ క్రమంలో 2020 రివ్యూను ప్రముఖ మ్యూజిక్ యాప్ స్పాటిఫై విడుదల చేసింది. ‘స్పాటిఫై ర్యాప్‌డ్ 2020’ పేరుతో తమ యూజర్స్ […]

Update: 2020-12-03 07:31 GMT

దిశ, వెబ్‌డెస్క్ : డిసెంబర్ వచ్చిందంటే చాలు.. గత పదకొండు నెలల్లో ఏమేం చేశామనే దాని గురించి యాప్‌‌లు రివ్యూలు మొదలుపెడతాయి. నిజానికి ఈ 2020లో గత పదకొండు నెలల్లో పెద్దగా పొడిచిందేమీ లేదు. కానీ పాటలు వినడానికి మాత్రం కావాల్సినంత సమయం దొరికింది. అందుకే మ్యూజిక్ యాప్‌లకు రివ్యూలు చేసుకునే అవకాశం దొరికింది. ఈ క్రమంలో 2020 రివ్యూను ప్రముఖ మ్యూజిక్ యాప్ స్పాటిఫై విడుదల చేసింది. ‘స్పాటిఫై ర్యాప్‌డ్ 2020’ పేరుతో తమ యూజర్స్ ఎక్కువగా ఏ పాట విన్నారు, ఏ ఆల్బమ్ విన్నారు, ఏ పాడ్‌కాస్ట్ విన్నారు, ఎవరి పాటలు ఎన్నిసార్లు విన్నారు లాంటి ప్రశ్నలకు సమాధానాలతో రివ్యూలను ప్రచురిస్తోంది.

యూజర్లకు ఎవరికి వారు ఈ రివ్యూను చెక్ చేసుకోవచ్చు. మీ ఆండ్రాయిడ్ లేదా ఆపిల్ ఫోన్ స్పాటిఫై యాప్ ఓపెన్ చేసి, మెయిన్ హోమ్ పేజీలో 2020 ర్యాప్‌డ్ అనే సెక్షన్ ఉంటుంది. అందులో మీరు 2020లో విన్న పాటలు, ఆర్టిస్ట్‌లు, ఏది ఎన్నిసార్లు విన్నారు లాంటి వివరాలన్నింటినీ చూపిస్తుంది. ఈ వివరాలను నేరుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకునే అవకాశాన్ని కూడా స్పాటిఫై కల్పించింది. స్పాటిఫైలో డేటాను నేరుగా ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్, ట్విట్టర్‌లో పోస్ట్ చేసుకోవచ్చు. టాప్ ఆర్టిస్ట్‌లు, టాప్ పాటలతో పాటు టాప్ పాడ్‌కాస్ట్‌లకు కూడా స్థానం కల్పించడంతో పాడ్‌కాస్ట్ ట్రెండ్ కూడా త్వరలో పుంజుకోనుందని నిపుణులు అంటున్నారు. ఏదేమైనా కష్టకాలంలో గడచిన ఈ 2020లో మనసును ప్రశాంతంగా ఉంచిన, ధైర్యాన్ని పంచిన పాటలు, ఆర్టిస్ట్‌లకు ఇలా ర్యాంక్‌లతో పట్టం కట్టడం నిజంగా వారికి ఒకింత ప్రోత్సాహాన్ని ఇచ్చినట్లేనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News