టీమిండియా ఆటగాళ్లు రోహిత్ శర్మ-విరాట్ చివరి మ్యాచ్ ఇదేనా? బాధలో ఫ్యాన్స్

వికెట్ల రారాజులు విరాట్ కోహ్లీ, రోహిత్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అక్కర్లేదు

Update: 2024-06-29 04:35 GMT

దిశ, వెబ్‌డెస్క్: వికెట్ల రారాజులు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అక్కర్లేదు. దశాబ్ద కాలంగా భారత క్రికెట్‌కు ఎనలేని సేవలను అందించారు. స్టేడియంలో వీరి ఆట చూడడం కోసం వేల మంది చుట్టుముడుతారు. టీ 20 ప్రపంచకప్‌లో 2 వ సెమీ ఫైనల్‌లో భారత జట్టు విజయం సాధించింది. గయానాలోని ప్రొడిడెన్స్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో 172 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌ను 16. 4 ఓవర్లలో 103 పరుగులకే ఆలౌట్ చేసింది. దీంతో భారత జట్టు 68 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో టీమిండియా ఫైనల్స్‌లోకి ప్రవేశించింది. అయితే అంతబానే ఉన్నప్పటికీ టీమ్ ఇండియా సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇవాళ జరిగే టీ 20 వరల్డ్ కప్ ఫైనల్ చివరి మ్యాచ్ అని పలువురు భావిస్తున్నారు. ఈ మ్యాచ్ లో విజయం సాధించిన, ఓటమి పాలైన విరాట్, కోహ్లీకి ఇదే ఆఖరి అంతర్జాతీయ టీ 20 మ్యాచ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కుర్రాళ్లకు అవకాశం ఇచ్చేందుకు వీరిద్దరు పొట్టి ఫార్మాట్ కు గుడ్ బై చెప్పే చాన్స్ కనిపిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. వన్డే, టెస్టుల్లో ఇంకా ఎన్ని సంవత్సరాలు కొనసాగుతారో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ వార్త విన్న విరాట్-కోహ్లీ ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు. విరాట్, కోహ్లీ లేని మ్యాచ్ ఊహించుకోలేమంటూ సోషల్ మీడియా వేదికన బాధను వ్యక్తం చేస్తున్నారు.

Similar News