క్వార్టర్స్‌లో భారత జట్టు ఓటమి

బ్యాడ్మింటన్ ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్స్‌ టోర్నీలో టీమ్ ఈవెంట్‌లో భారత్ పోరాటం ముగిసింది.

Update: 2024-07-01 15:52 GMT

దిశ, స్పోర్ట్స్ : ఇండోనేషియాలో జరుగుతున్న బ్యాడ్మింటన్ ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్స్‌ టోర్నీలో టీమ్ ఈవెంట్‌లో భారత్ పోరాటం ముగిసింది. సోమవారం జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో భారత జట్టు 2-3 తేడాతో మలేషియా చేతిలో పరాజయం పాలైంది. మ్యాచ్‌లో మొదట భారత్‌కు అదిరిపోయే ఆరంభం దక్కింది. మిక్స్‌డ్ డబుల్స్‌లో సంస్కార్ సరస్వత్-శ్రావణి జోడీ, ఉమెన్స్ సింగిల్స్‌లో తన్వీ శర్మ నెగ్గడంతో భారత్ 2-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత జట్టు ఆ జోరును కొనసాగించలేకపోయింది. మిగతా మూడు గేమ్‌ల్లో ఓడి పోయి మూల్యం చెల్లించుకుంది. మెన్స్ సింగిల్ష్‌లో ప్రణయ్ ఓడిపోగా.. ఉమెన్స్ డబుల్స్‌లో నవ్య-శ్రావణి, మెన్స్ డబుల్స్‌లో భార్గవ్ రామ్-అర్ష్ జంటలు నిరాశపరిచాయి. ఈ టోర్నీలో బుధవారం నుంచి వ్యక్తిగత ఈవెంట్‌ ప్రారంభంకానుంది. టీమ్ ఈవెంట్‌లో బరిలోకి దిగిన భారత షట్లర్లే వ్యక్తిగత ఈవెంట్‌లో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇప్పటివరకు భారత్ నుంచి పీవీ సింధు(2012, గర్ల్స్ సింగిల్స్), లక్ష్యసేన్(2018, బాయ్స్ సింగిల్స్) మాత్రమే స్వర్ణ పతకాలు దక్కించుకున్నారు. 

Similar News