10 వికెట్ల తేడాతో భారత్ భారీ విజయం

సౌతాఫ్రికా, భారత్ మహిళా జట్ల మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో భారత్ భారీ విజయాన్ని అందుకుంది.

Update: 2024-07-01 11:39 GMT

దిశ, వెబ్ డెస్క్: సౌతాఫ్రికా, భారత్ మహిళా జట్ల మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో భారత్ భారీ విజయాన్ని అందుకుంది. చెన్నై‌లోని చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ మొదటి ఇన్నింగ్స్ లో ఏకంగా 603 పరుగుల వద్ద డిక్లేర్ ఇచ్చింది. అనంతరం బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా మహిళల జట్టు మొదటి ఇన్నింగ్స్ లో 266 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో భారత్ ఫాలో ఆన్ ప్రకటించడంతో రెండో ఇన్నింగ్స్ లో 373 పరుగులకు ఆలౌట్ అయిన సౌతాఫ్రికా జట్టు భారత్ ముందు 37 పరుగుల లక్ష్యం ఉంచింది. దీంతో భారత్ 9.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేదించి సౌతాఫ్రికా జట్టుపై 10 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. ఈ ఏకైక టెస్ట్ సిరీస్ లో భారత బ్యాటర్లు షెఫాలి వర్మ 205, స్మృతి మంధన 149, రోడ్రిగ్స్ 55, హర్మన్ ప్రీత్ కౌర్ 69, రిచా గోష్ 86 పరుగులతో రాణించారు. అలాగే సౌతాఫ్రికాపై మొదటి ఇన్నింగ్స్ లో 8, రెండో ఇన్నింగ్స్ లో 2 వికెట్లు తీసుకున్న స్నేహ్ రాణాకు ప్లేయర్ ఆఫ్ ది టెస్ట్ మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ విజయంతో భారత్ సౌతాఫ్రికా జట్టుపై టెస్ట్ సిరీస్ ను కైవసం చేసుకొగా.. అంతకు ముందు మూడు వన్డేల సిరీస్ ను కూడా భారత మహిళల క్లీన్ స్వీప్ చేసింది.

Similar News