కొత్త రోల్‌లో దినేశ్ కార్తీక్.. ఐపీఎల్‌‌లో ఆ జట్టు తరపున రీఎంట్రీ

భారత మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ ఐపీఎల్‌లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

Update: 2024-07-01 12:41 GMT

దిశ, స్పో్ర్ట్స్ : భారత మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ ఐపీఎల్‌లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇటీవలే క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన అతను కొత్త రోల్‌లో కనిపించబోతున్నాడు. ప్రస్తుతం కామెంటేటర్‌గా అలరిస్తున్న కార్తీక్ వచ్చే సీజన్‌లో కోచ్‌గా కూడా అవతారమెత్తనున్నాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) జట్టుకు మెంటార్, బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని ఆర్సీబీ సోమవారం వెల్లడించింది

‘మా వికెట్‌ కీపర్‌కు స్వాగతం. దినేశ్ కార్తీక్ కొత్త అవతారంలో తిరిగి ఆర్సీబీలోకి తిరిగివచ్చాడు. పురుషుల జట్టుకు డీకే బ్యాటింగ్ కోచ్, మెంటార్‌గా వ్యవహరించనున్నాడు. క్రికెట్ నుంచి అతడిని వేరు చేయొచ్చు. కానీ, క్రికెట్‌ అతడికి దూరం కాదు.’ అని ఎక్స్‌లో పోస్టు చేసింది. కాగా, 16 ఏళ్ల ఐపీఎల్ కెరీర్‌కు దినేశ్ కార్తీక్ ఈ సీజన్‌తో ముగింపు పలికాడు.

ఈ సీజన్‌లో ఆర్సీబీ తరపున రాజస్థాన్‌తో ఆడిన ఎలిమినేటర్ మ్యాచే అతనికి చివరిది. ఐపీఎల్‌లో ఆర్సీబీతోపాటు కోల్‌కతా, ముంబయి ఇండియన్స్, గుజరాత్‌ లయన్స్‌ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. మొత్తం 257 మ్యాచ్‌ల్లో 4,842 పరుగులు చేశాడు. ఫినిషర్‌గా ఆర్సీబీకి ఎన్నోసార్లు అద్భుత విజయాలు అందించిన కార్తీక్‌ వచ్చే సీజన్‌లో కోచ్‌గా జట్టుకు సేవలందించనున్నాడు. 

Similar News