డేంజరస్ బ్యాటర్‌ను కొనుగోలు చేసిన సన్ రైజర్స్ జట్టు

ఐపీఎల్ మెగా వేలానికి ముందు.. ఎక్కువగా ఫారన్ ప్లేయర్లను హైదరాబాద్(SRH) జట్టు రిటైన్ చేసుకున్న సంగతి తెలిసిందే.

Update: 2024-11-24 14:43 GMT

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ మెగా వేలానికి ముందు.. ఎక్కువగా ఫారన్ ప్లేయర్లను హైదరాబాద్(SRH) జట్టు రిటైన్ చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా ఈ రోజు దుబాయ్ వేదికగా జరుగుతున్న మెగా వేలం(mega Auction)లో భారత ప్లేయర్లపై దృష్టి సారించిన SRH జట్టు కీలక బౌలర్లను, బ్యాటర్లను కొనేందుకు ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగా.. రిషబ్ పంత్ ను కొనేందుకు చివరి వరకు ప్రయత్నించింది. అలాగే స్టార్ బౌలర్లు అయిన అర్షదీప్, చహల్ లను సొంతం చేసుకునేందుకు కూడా ప్రయత్నించింది.

అలాగే ముంబై ఇండియన్స్(Mumbai indian) జట్టు సుదీర్ఘంగా ఆడుకుంటు వచ్చిన ఇషాన్ కిషన్(ishan kishan) ను సొంతం చేసుకునేందుకు ఢిల్లీ, కేకేఆర్, ముంబై జట్టుతో పోటి పడిని ఎస్‌ఆర్‌హెచ్ జట్టు చిట్ట చివరకు డెంజరస్ ఓపెనర్ గా పేరుగాంచిన లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ అయిన ఇషాన్ కిషన్ ను సొంతం చేసుకుంది. రూ. 2 కోట్ల బేస్ ప్రైజ్‌తో వేలంలో ఉన్న కిషన్‌ను సొంతం చేసుకునేందుకు పలు జట్లు పోటి పడటంతో.. అతని ధర అమాంతం పెరిగిపోయింది. చిట్టచివరకు 11.25 కోట్లకు ఇషాన్ కిషన్ ను సన్ రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) జట్టు సొంతం చేసుకుంది. దీంతో నేటి వేలంలో హైదరాబాద కోనుగోలు చేసిన మూడో ప్లేయర్ గా కిషన్ నిలిచాడు.


Similar News