IPL: భారీ ధరకు అమ్ముడు పోయిన SRH ప్లేయర్
ఐపీఎల్(IPL) మెగా వేలం దుబాయ్ వేదికగా రసవత్తరంగా కొనసాగుతోంది. ఈ మెగా వేలం( mega auction)లో ఈ సంవత్సరం.. భారత ప్లేయర్లకు కాసుల పంట పండుతోంది.
దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్(IPL) మెగా వేలం దుబాయ్ వేదికగా రసవత్తరంగా కొనసాగుతోంది. ఈ మెగా వేలం( mega auction)లో ఈ సంవత్సరం.. భారత ప్లేయర్లకు కాసుల పంట పండుతోంది. వేలానికి ముందు రిటెన్షన్‌లో కీలక ఫారెన్ ప్లేయర్లను అంటిపెట్టుకున్న జట్లు.. వేలంలో మాత్రం భారత ప్లేయర్లను కొనేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలో రిషబ్ పంత్, శ్రేషస్, వెంకటేష్, అక్షదీప్, చహల్, కిషన్, వంటి ప్లేయర్లకు కోట్లు వెంచించి కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఆడిన నటరాజన్ మంచి పేరును సంపాదించుకున్నారు.
అనంతరం గాయాల కారణంగా.. కొంతకాలం మ్యాచులకు దూరంగా ఉన్న నటరాజన్(Natarajan).. తిరిగి వేలం లోకి వచ్చారు. ఈ క్రమంలో అతన్ని దక్కించుకునేందుకు. హైదరాబాద్, ఢిల్లీ, పంజాబ్, ముంబై జట్లు పోటీ పడ్డాయి. దీంతో రెండు కోట్ల బేస్ ప్రైజ్ తో వేలంలోకి వచ్చిన నటరాజన్ ధర అమాంతం పెరిగిపోయింది. చివరకు ఢిల్లీ, రాజస్థాన్, ముంబై జట్ల మధ్య పోటీ ఏర్పడగా.. నటరాజన్‌ను ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) జట్టు 10. 75 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో మెగా వేలంలో అత్యధిక ధర పలికిన భారత ప్లేయర్లలో నటరాజన్ చోటు దక్కించుకున్నారు.