పాండ్యా నిరూపించుకున్నాడు.. కెప్టెన్‌పై త్వరలోనే ప్రకటన : జై షా

టీమ్ ఇండియా టీ20 జట్టు కెప్టెన్‌పై సెలెక్టర్లు నిర్ణయం తీసుకుంటారని బీసీసీఐ సెక్రెటరీ జై షా తెలిపారు.

Update: 2024-07-01 16:05 GMT

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా టీ20 జట్టు కెప్టెన్‌పై సెలెక్టర్లు నిర్ణయం తీసుకుంటారని బీసీసీఐ సెక్రెటరీ జై షా తెలిపారు. తాజాగా బార్బడోస్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సెలెక్టర్లతో చర్చించిన తర్వాత బీసీసీఐ కొత్త కెప్టెన్‌ను ప్రకటిస్తుందని చెప్పారు. ‘కెప్టెన్సీని సెలెక్టర్లు నిర్ణయిస్తారు. వారితో చర్చించిన తర్వాత ప్రకటిస్తాం. హార్దిక్ పాండ్యాపై చాలా ప్రశ్నలు వచ్చాయి. అయితే, సెలెక్టర్లు అతనిపై నమ్మకం ఉంచారు. అతను కూడా నిరూపించుకున్నాడు.’అని వ్యాఖ్యానించారు.

అలాగే, కొత్త హెడ్ కోచ్‌గా గురించి స్పందిస్తూ.. శ్రీలంక పర్యటనతో కొత్త హెడ్ కోచ్ బాధ్యతలు చేపడతాడని తెలిపారు. ‘కోచ్, సెలెక్టర్ నియామకాలు త్వరలో జరుగుతాయి. క్రికెట్ అడ్వైజరీ కమిటీ(సీఏసీ) ఇంటర్వ్యూలు జరిపింది. ఇద్దరు షార్ట్‌లిస్ట్ అయ్యారు. ముంబైకి చేరుకున్న తర్వాత సీఏసీ ప్రతిపాదనల మేరకు ముందుకు వెళ్తాం.’ అని చెప్పారు. జింబాబ్వే టూరుకు ఎన్‌సీఏ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ జట్టుతో వెళ్తాడని వెల్లడించారు. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్, చాంపియన్స్ ట్రోఫీ గెలవడం ఇప్పుడు తమ ముందున్న లక్ష్యమని, ఆ టోర్నీలో సీనియర్లు ఆడతారని తెలిపారు.  

Similar News