Virat Kohli: టీమిండియా ఫ్యాన్స్‌కు భారీ గుడ్ న్యూస్.. సస్పెన్షన్ నుంచి తృటిలో తప్పించుకున్న కోహ్లీ
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024 (Border-Gavaskar Trophy 2024) లో భాగంగా మెల్‌బోర్న్ (Melbourne) వేదికగా ఇండియా (India), ఆస్ట్రేలియా (Australia) మధ్య జరుగుతోన్న నాలుగో టెస్ట్ ఉత్కంఠ రేపుతోంది.
దిశ, వెబ్‌డెస్క్: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024 (Border-Gavaskar Trophy 2024) లో భాగంగా మెల్‌బోర్న్ (Melbourne) వేదికగా ఇండియా (India), ఆస్ట్రేలియా (Australia) మధ్య జరుగుతోన్న నాలుగో టెస్ట్ ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటికే మూడు మ్యాచ్‌లలో రెండు జట్లు చెరో మ్యాచ్‌లో విజయం సాధించగా.. ఆడిలైడ్ టెస్ట్ డ్రాగా ముగిసింది. మిగిలిన రెండు మ్యాచ్‌లలో విజయం సాధించి ఎలాగైనా టైటిల్ కొట్టేయాలని ఆస్ట్రేలియా (Australia) చూస్తుండగా.. మరోవైపు టీమిండియా (Team India) కూడా వరుస విజయాలపై కన్నేసింది. అయితే, ఇవాళ ప్రారంభమైన మెల్‌బోర్న్ (Melbourne) టెస్ట్ ఇరు జట్లలో హీట్‌ను పుట్టిస్తోంది. వివరాల్లో్కి వెళితే.. ఆసీస్ జట్టు ఇవాళ అరంగేట్రం చేసిన సామ్ కోన్‌స్టాస్ (Sam Constance) (65 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 60) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగడంతో విరాట్ కోహ్లీ (Virat Kohli) ఓకింత ఆగ్రహానికి గురయ్యాడు.
దీంతో ఆ 19 ఏళ్ల కుర్రాడిని కవ్వించే ప్రయత్నం చేశాడు. ఏకంగా ఎదురుగా వెళ్లి సామ్ కోన్‌స్టాస్ (Sam Constance) భుజాన్ని కోహ్లీ బలంగా ఢీకొట్టాడు. అనంతరం అతనితో వాగ్వాదానికి దిగాడు. ఉస్మాన్ ఖవాజా (Usman Khawaja), అంపైర్లు జోక్యం చేసుకుని ఇద్దర్ని వారించారు. ఈ ఘటన ఆసీస్ తొలి ఇన్నింగ్స్ 10వ ఓవర్ అనంతరం చోటుచేసుకుంది. ఆ ఓవర్ పూర్తయిన వెంటనే సామ్ కోన్‌స్టాస్ (Sam Constance) మరో ఎండ్ వైపు నడుస్తుండగా కోహ్లీ అతడికి డ్యాష్ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ (Virat Kohli)పై ఓ మ్యాచ్ నిషేధం పడుతుందని అందరూ భావించారు. కానీ, అంపైర్ల ఫిర్యాదుతో విచారణ చేపట్టిన మ్యాచ్ రిఫరీ ఐసీసీ నిబంధనల ప్రకారం లెవల్-1 నేరంగా పరిగణించి 20 శాతం మ్యాచ్ ఫీజు కోతతో పాటు ఒక డీమెరిట్ పాయింట్ (Demerit Point) కేటాయించారు. అసలే కీలక మ్యాచ్‌లో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని చూస్తున్న టీమిండియా (Team India)కు విరాట్ సస్పెన్షన్ వేటు నుంచి తప్పించుకోవడం శుభ పరిణామమేనని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.