Kohli : కోహ్లీ-సామ్ కొన్‌స్టాస్ వివాదం.. సునీల్ గవాస్కర్ కీలక సూచన
ఆటలో పోటీ పడాలని.. ఫిజికల్‌గా కాదని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అన్నాడు.
దిశ, స్పోర్ట్స్ : ఆటలో పోటీ పడాలని.. ఫిజికల్‌గా కాదని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అన్నాడు. బాక్సింగ్ డే టెస్ట్ తొలిరోజు కోహ్లీ-సామ్ కొన్‌స్టాస్ వివాదంపై జాతీయ మీడియాతో గవాస్కర్ గురువారం మాట్లాడారు. ‘నాకు కారణమైతే తెలియదు. కానీ ఇదంతా అవసరం లేదు. ఏ స్థాయి క్రికెట్‌లో అయినా ఇలా చేయకూడదు. అంతర్జాతీయ స్థాయిలో అస్సలు ఇలా జరగకూడదు. క్రికెట్‌లో పోటీతత్వం ఉండాలి కానీ అది ఫిజికల్‌గా కాదు. ఐసీసీ జరిమానా విధించిన వ్యక్తిగా కన్నా.. కోహ్లీ అత్యుత్తమ క్రికెటర్లలో ఒకరని మాత్రమే మనందరికీ తెలుసు. కోహ్లీ మళ్లీ ఇలాంటివి జరగుకుండా చూసుకుంటాడని భావిస్తున్నాను. పోటీతత్వం కోహ్లీ సహజ స్వభావం. వికెట్ పడిన ప్రతీసారి కోహ్లీ ఎలా సంబరాలు చేసుకుంటాడో మనందరికీ తెలుసు.’ అని గవాస్కర్ అన్నాడు. తొలి రోజు తొలి సెషన్‌లో కోహ్లీ కాన్‌స్టాస్ భుజాన్ని తాకుతూ వెళ్లాడు. దీంతో ఐసీసీ కోహ్లీ మ్యాచ్ ఫీజులో 20 శాతం, డీమెరిట్ పాయింట్‌ను జరిమానాగా విధించింది.