జాతీయ సాఫ్ట్ బాల్ పోటీల్లో కేరళ జట్లు విజయం

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం తిలక్ గ్రౌండ్ లో నిర్వహించిన తొమ్మిదవ జాతీయ అండర్ 14 జాతీయ సాఫ్ట్ బాల్ పోటీల్లో కేరళ ఉమెన్, మెన్ విభాగాల విన్నర్ గా నిలిచాయి.

Update: 2024-12-26 15:52 GMT

దిశ,బెల్లంపల్లి : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం తిలక్ గ్రౌండ్ లో నిర్వహించిన తొమ్మిదవ జాతీయ అండర్ 14 జాతీయ సాఫ్ట్ బాల్ పోటీల్లో కేరళ ఉమెన్, మెన్ విభాగాల విన్నర్ గా నిలిచాయి. ఈ నెల 24న ప్రారంభమైన 9వ సబ్ జూనియర్, యూత్ నేషనల్ సాఫ్ట్ బేస్ బాల్ బాల, బాలికల పోటీలు గురువారం అట్టహాసంగా ముగిశాయి. ఈ పోటీల్లో12 రాష్ట్రాలకు చెందిన జట్లు పాల్గొన్నాయి.

    విజేత జట్లకు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు రేణికుంట్ల ప్రవీణ్, టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ నాతరి స్వామి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడారు. బెల్లంపల్లిలో నేషనల్ గేమ్స్ నిర్వహించడం అభినందనీయమన్నారు. క్రీడల వల్ల యువతీ యువకుల్లో చక్కటి క్రమశిక్షణ అలవర్చుకోవచ్చన్నారు. ఓటమి, గెలుపులు ముఖ్యం కాదని క్రీడాకారులు గ్రహించాలన్నారు. క్రీడల్లో రాణిస్తేనే భవిష్యత్తు ఉంటుందన్నారు.

హోరాహోరీగా పోటీలు..

సెమి ఫైనల్స్, ఫైనల్స్ మ్యాచ్ లు తెలంగాణ, కేరళ, హర్యానా, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల మద్య హోరా హోరీగా జరిగాయి. ఈ పోటీల్లో సబ్ జూనియర్స్ బాలబాలికలు, యూత్ మెన్స్, ఉమెన్స్ ఓవరల్ చాంపియన్ షిప్ ను కేరళ కైవసం చేసుకుంది. ద్వితీయ స్థానంలో మహారాష్ట్ర, తృతీయ స్థానంలో తెలంగాణ జట్లు నిలిచాయి. ఈ పొటీల్లో సబ్ జూనియర్ బాయ్స్ లో కేరళ జట్టు ఫస్ట్ ప్లేస్, మహారాష్ట్ర సెకండ్ ప్లేస్, తెలంగాణ థర్డ్ ప్లేస్ సాధించాయి. గర్ల్స్​ విభాగాంలో ఫస్ట్ ప్లేస్ లో కేరళ, సెకండ్ ప్లేస్ లో తెలంగాణ, థర్డ్ ప్లేస్ లో మధ్య ప్రదేష్ జట్లు ఉన్నాయి. యూత్ మెన్స్ విభాగంలో కేరళ ఫస్ట్ ప్లేస్, తెలంగాణ సెకండ్ ప్లేస్, మహారాష్ట్ర థర్డ్, యూత్ ఉమెన్స్ విభాగంలో కేరళ ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ మహారాష్ట్ర, థర్డ్ ప్లేస్ లో తెలంగాణ జట్టు నిలిచింది.

    పోటీల నిర్వహణకుడు సాఫ్ట్ బాల్ సంఘం అధ్యక్షుడు పులియల రవికుమార్ క్రీడల నిర్వహణకు సహకరించిన గేమ్స్ ఇండియన్ సెక్రటరీ నామ్ దేవ్ జగన్నాథ్ షిండే కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ సీనియర్ లీడర్లు మనిమంద రమేష్, సాఫ్ట్ బేస్ బాల్ రాష్ట్ర సెక్రటరీ దుర్గం గురవేందర్ సింగ్, జాయింట్ సెక్రటరీ ఉప్పులేటి వెంకటేష్, ట్రెజరర్ ఇమ్మాన్యుయల్, పీఈటీ రాజ్ మహమ్మద్, జిల్లా త్రోబాల్ సెక్రటరీ బలరాం, టైక్వాండో ఉమ్మడి జిల్లా ఇన్ చార్జి జిల్లపల్లి వెంకటస్వామి, అండర్ 19 ఎస్ జీఎఫ్ సెక్రటరీ బాబురావు పాల్గొన్నారు.  


Similar News