IND Vs AUS: బాక్సింగ్ డే టెస్ట్‌లో ఆస్ట్రేలియా ఆలౌట్.. ఆదిలోనే భారత్‌కు ఎదురుదెబ్బ
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (Border-Gavaskar Trophy)లో భాగంగా మెల్బోర్న్ (Melbourne) వేదికగా జరుగుతోన్న బాక్సింగ్ డే (Boxing Day) టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా (Australia) భారీ స్కోర్ చేసింది.
దిశ, వెబ్‌డెస్క్: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (Border-Gavaskar Trophy)లో భాగంగా మెల్బోర్న్ (Melbourne) వేదికగా జరుగుతోన్న బాక్సింగ్ డే (Boxing Day) టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా (Australia) భారీ స్కోర్ చేసింది. ఆ జట్టు 474 పరుగులకు ఆలౌట్ అయింది. 6 వికెట్లు 311 పరుగుల ఓవర్ నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆట ప్రారంభించిన కంగారు జట్టు మరో 163 పరుగులు జోడించి మిగతా 4 వికెట్లు కోల్పోయింది. ఆసీస్ బ్యాట్స్మెన్లలో స్టీవ్ స్మిత్ (Steven Smith) (140) మెరుపు సెంచరీతో అదగొట్టాడు. సామ్ కాన్స్టాస్ (Sam Konstas) (60), ఉస్మాన్ ఖావాజా (Usman Khawaja) (57), మార్నస్ లబుషేన్ (Marnus Labuschagne) (72) హాఫ్ సెంచరీలు చేశారు. ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ (Pat Cummins) త్రుటిలో హాఫ్ సెంచరీ (49) చేజార్చుకున్నాడు.
స్మిత్‌తో కలిసి ఎనిమిదో వికెట్‌కు కమ్మిన్స్ ఏకంగా 112 పరుగుల పార్ట్నర్ షిప్ బిల్డ్ చేశారు. టీమిండియా బౌలర్లలో జస్ర్పీత్ బుమ్రా (Jaspreet Bumrah) 4 వికెట్లు, రవీంద్ర జడేజా (Ravindra Jadeja) 3, ఆకాశ్ దీప్ (Akash Deep) 2, వాషింగ్టన్ సుందర్ (Washington Sunder) ఒక వికెట్ నేలకూల్చారు. అనంతరం మొదటి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 8 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ (Rohith Sharma) కేవలం మూడు పరుగులు మాత్రమే చేసి పెవీలియన్ చేరాడు. ప్రస్తుతం భారత జట్టు 1 వికెట్ నష్టానికి 34 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (Yashswi Jaiswal) 23 బంతుల్లో 17 పరుగులు, కేఎల్ రాహుల్ (KL Rahul) 20 బంతుల్లో 13 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.