జైశ్వాల్‌ను మందలిచ్చిన రోహిత్.. గల్లీ క్రికెట్ ఆడుతున్నవా? అంటూ ఫైర్

ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టులో నిర్లక్ష్యంగా ఫీల్డింగ్ చేసిన యువ బ్యాటర్ యశస్వి జైశ్వాల్‌ను కెప్టెన్ రోహిత్ మందలిచ్చాడు.

Update: 2024-12-26 15:34 GMT

దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టులో నిర్లక్ష్యంగా ఫీల్డింగ్ చేసిన యువ బ్యాటర్ యశస్వి జైశ్వాల్‌ను కెప్టెన్ రోహిత్ మందలిచ్చాడు. సిల్లీ పాయింట్‌లో ఫీల్డింగ్ చేసిన జైశ్వాల్ పలు మార్లు జంప్‌లు చేశాడు. ఈ క్రమంలోనే జడేజా బౌలింగ్‌లో స్మిత్ డిఫెన్సివ్ ఆడాడు. బంతి ఆదుకోకుండా జైశ్వాల్ జంప్ చేశాడు. ఆ తర్వాత కూడా అక్కడి నుంచి కదలకుండా అలాగే నిల్చుండిపోయాడు. వెనకాల ఉన్న జడేజా బంతిని పట్టుకున్నాడు. జైశ్వాల్ నిర్లక్ష్యంగా ఉండటం కెప్టెన్‌కు ఆగ్రహం తెప్పించింది. గల్లీ క్రికెట్ ఆడుతున్నావా? అంటూ ఫైర్ అయ్యాడు. ‘ఏయ్ జైశ్వాల్.. గల్లీ క్రికెట్ ఆడుతున్నావా?. బ్యాటర్ బంతిని టచ్ చేసేంత వరకు నీ పొజిషన్‌లోనే ఉండు. కింద కూర్చున్నట్లుగానే ఉండు. అంతేకానీ, నిలబడేందుకు ప్రయత్నించకు.’ అంటూ మందలించాడు. రోహిత్ మాటలు స్టంప్స్ మైక్‌లో రికార్డు అయ్యాయి. ఆ వీడియోను స్టార్ స్పోర్ట్స్ సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. వైరల్ అయ్యింది.



Tags:    

Similar News