హానీమూన్ వదులుకుని..రెండు చేతులతో బౌలింగ్..SRHలో మరో ఆణిముత్యం ?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( IPL 2025) నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) జట్టులో

దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( IPL 2025) నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) జట్టులో మరో ఆణిముత్యం తెరపైకి వచ్చింది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఎక్కువగా హార్డ్ హిట్టర్స్ ఉంటారు. కానీ.. తాజాగా రెండు చేతులతో బౌలింగ్ చేసే.. సరికొత్త ఆటగాడు వెలుగులోకి వచ్చాడు. అతను ఎవరో కాదు కమిందు మెండిస్ ( Kamindu Mendis ). ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా.. గురువారం రోజున హైదరాబాద్ వర్సెస్ కేకేఆర్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.
ఈ మ్యాచ్ లో హైదరాబాద్ ఓడిపోయినప్పటికీ... కమిందు మెండిస్ మాత్రం అందర్నీ ఆకట్టుకున్నాడు. నిన్నటి మ్యాచ్ లో ఆడిన కమిందు మెండిస్... ఒకే ఒక్క ఓవర్.. వేసి ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. ఒకే ఓవర్ లో ఏకంగా రెండు చేతులతో బౌలింగ్ చేసి... కేకేఆర్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు కమిందు మెండిస్. నిన్నటి మ్యాచ్ లో ఒక్క ఓవర్ వేసి... వికెట్ తీయడమే కాకుండా కేవలం నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చాడు. వెంకటేష్ అయ్యర్ కు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ చేస్తుండగా.. తన రైట్ హ్యాండ్ తో మెండిస్ బౌలింగ్ చేశాడు. అలాగే సూర్యవంశీ రైట్ హ్యాండ్ బ్యాటింగ్ చేస్తే లెఫ్ట్ హ్యాండ్ తో బౌలింగ్ చేశాడు. ఇలా కేకేఆర్ బౌలర్లను కన్ఫ్యూజ్ చేసి ఒక వికెట్ పడగొట్టాడు.
ఎవరీ కామిందు మెండిస్?
ఐపీఎల్ మెగా వేలం గత ఏడాది చివరలో జరగగా...కమిందు మెండిస్ ను 75 లక్షలకు కొనుగోలు చేసింది సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం. ఇతను శ్రీలంకకు ( Srilanka ) చెందిన క్రికెటర్. అయితే.. తన చిన్ననాటి స్నేహితురాలును మార్చి నెలలో పెళ్లి చేసుకున్నాడు మెండిస్. గత సంవత్సరం ఏప్రిల్ లో ఎంగేజ్మెంట్ జరిగింది. అయితే మొన్న పెళ్లి అయిన తర్వాత.. హనీమూన్ వెళ్లకుండా... ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో ఆడేందుకు ఇండియాకు వచ్చేసాడు కామిందు మెండిస్. ఇక ఇప్పుడు ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు.