Bumrah : కుంబ్లే రికార్డు బ్రేక్.. బుమ్రా సాధించిన ఫీట్ ఇదే..?
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ నాలుగో టెస్ట్‌లో బుమ్రా భారత స్పిన్ బౌలర్ అనిల్ కుంబ్లే రికార్డును బద్దలు కొట్టాడు.
దిశ, స్పోర్ట్స్ : బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ నాలుగో టెస్ట్‌లో బుమ్రా భారత స్పిన్ బౌలర్ అనిల్ కుంబ్లే రికార్డును బద్దలు కొట్టాడు. బాక్సింగ్ డే టెస్ట్ తొలి రోజు ఆటలో బుమ్రా మూడు వికెట్లు పడగొట్టాడు. ఉస్మాన్ ఖవాజా, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్‌లను పెవిలియన్‌కు పంపాడు. తద్వారా మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా నిలిచాడు. గతంలో అనిల్ కుంబ్లే పేరిట ఉన్న ఈ రికార్డును బుమ్రా బ్రేక్ చేశాడు. ఎంసీజీలో ఇప్పటి వరకు బుమ్రా 18 వికెట్లు తీసి ఈ ఘనత సాధించాడు. ఇదే మ్యాచ్‌లో ట్రావిస్ హెడ్‌ను బుమ్రా తొలి బంతికి డకౌట్ చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో హెడ్‌ను డకౌట్ చేసిన తొలి భారత బౌలర్‌గా నిలిచాడు. బుమ్రా మరో 3 వికెట్లు పడగొడితే టెస్ట్‌ల్లో 200 వికెట్లు తీసిన 12వ భారత బౌలర్‌గా నిలవనున్నాడు. తొలి రోజు 21 ఓవర్లు వేసిన బుమ్రా 75 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. అర్ధ సెంచరీతో రాణించిన ఉస్మాన్ ఖవాజాను ఔట్ చేసిన బుమ్రా స్వల్ప వ్యవధిలో హెడ్, మార్ష్‌లను పెవిలియన్ పంపాడు.