INDW vs PAKW: నేడు భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య కీలక మ్యాచ్

2024 ఐసీసీ మహిళల ఛాంపియన్స్ ట్రోపీ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీకి శ్రీలంక ఆతిథ్యం అందిస్తుంది.

Update: 2024-07-19 06:38 GMT

దిశ, వెబ్‌డెస్క్: 2024 ఐసీసీ మహిళల ఛాంపియన్స్ ట్రోపీ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీకి శ్రీలంక ఆతిథ్యం అందిస్తుంది. ఇందులో మొత్తం ఎనిమిది జట్లు పోటీ పడుతుండగా.. గ్రూప్-ఏలో భారత్, పాక్, నేపాల్, యూఏఈ జట్లు ఉండగా.. గ్రూప్-బీ లో బంగ్లాదేశ్, మలేషియా, శ్రీలంక, థాయిలాండ్ జట్లు ఉన్నాయి. గ్రూప్ స్టేజీలో ప్రతి జట్టు మూడు మ్యాచులు ఆడుతుంది. ఈ క్రమంలో నేడు మొదటి మ్యాచులో నేపాల్, యూఏఈ మహిళా జట్లు తలపడనుండగా.. రాత్రి 7 గంటలకు భారత్, పాకిస్తాన్ మహిళా జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే ఐసీసీ మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ ఇప్పటి వరకు 8 సార్లు నిర్వహించగా అందులో 7 సార్లు భారత మహిళల జట్టే విజేతగా నిలిచింది. ఈ రోజు జరిగే మ్యాచులో భారత్ విజయం సాధిస్తే సెమిస్ చేరుకునే అవకాశం ఈజీ అవుతుంది. మిగిలిన మ్యాచుల చిన్న జట్లతో కావడం విశేషం.

భారత మహిళా జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (c), ఉమా చెత్రీ (wk), షఫాలీ వర్మ, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, S సజన, పూజా వస్త్రాకర్, శ్రేయంక పాటిల్, అరుంధతి రెడ్డి, రాధా యాదవ్, దయాలన్ హేమలత, రేణుకా ఠాకూర్ సింగ్, రిచా ఘోష్, రిచా ఘోష్ శోభన

పాకిస్థాన్ మహిళా జట్టు: మునీబా అలీ (WK), నిదా దార్ (c), సిద్రా అమీన్, గుల్ ఫిరోజా, తుబా హసన్, అలియా రియాజ్, ఫాతిమా సనా, ఒమైమా సోహైల్, డయానా బేగ్, నష్రా సంధు, సాదియా ఇక్బాల్, సయ్యదా అరూబ్ షా, నజీహా అల్వీ, తస్మియా రుబాబ్, ఇరామ్ జావేద్

Tags:    

Similar News