ఇమానే ఖెలిఫ్ మహిళ కాదు పురుషుడే అని తేల్చిన నివేదిక
పారిస్ ఒలింపిక్స్(: Paris Olympics) 2024 లో 66 కేజీల మహిళల బాక్సింగ్(Boxing) విభాగంలో అల్జీరియన్ కు చెందిన బాక్సర్ ఇమానే ఖెలిఫ్(Imane Khalif) ఫైనల్ లో విజయం సాధించి.. గోల్డ్ మెడల్ సాధించింది.
దిశ, వెబ్ డెస్క్: పారిస్ ఒలింపిక్స్(: Paris Olympics) 2024 లో 66 కేజీల మహిళల బాక్సింగ్(Boxing) విభాగంలో అల్జీరియన్ కు చెందిన బాక్సర్ ఇమానే ఖెలిఫ్(Imane Khalif) ఫైనల్ లో విజయం సాధించి.. గోల్డ్ మెడల్ సాధించింది. కాగా ఆమె రూపు రేఖలు, శరీర దారుడ్యం.. పూర్తిగా మగవారిలా కనిపించడంతో మొదటి నుంచి ఇమానే ఖెలిఫ్(Imane Khalif) చుట్టూ వివాదం తీరుగుతూనే ఉంది. అయితే తాజాగా తనకు సంబంధించిన ఓ మెడికల్ రిపోర్ట్ లీక్ అయింది. ఆ రిపోర్టులో ఖేలిఫ్ మహిళ కాదని తేల్చి చేప్పిట్లు తెలుస్తుంది. ఖేలిఫ్ 5-ఆల్ఫా రిడక్టేజ్(5-alpha reductase) లోపంతో బాధపడుతున్నారని ఆ నివేదిక పేర్కొంది. ఇది మగవారిలో కనిపించే జన్యుపరమైన లైంగిక అభివృద్ధి రుగ్మతగా పేర్కొన్నారు. లీకైన వైద్య నివేదికలు 2023 జూన్‌లో ఫ్రాన్స్‌లోని పారిస్‌లోని క్రెమ్లిన్-బికేట్రే హాస్పిటల్, అల్జీరియాలోని అల్జీర్స్‌లోని మొహమ్మద్ లామైన్ డెబాఘైన్ హాస్పిటల్ మధ్య సహకారంతో రూపొందించారు
ఇమానే ఖెలిఫ్ మెడికల్ రిపోర్ట్
ఇమానే ఖెలిఫ్ వైద్య నివేదికలో MRIతో పాటు, అదనపు పరీక్షలు ఉన్నాయి. ఈ రిపోర్టులో ఖెలిఫ్ లైంగిక అభివృద్ధి యొక్క రుగ్మతతో సంబంధం ఉన్న లక్షణాలను సూచించింది. MRI రిపోర్టులో ఖేలిఫ్‌కు గర్భాశయం లేదని, అంతర్గత వృషణాలను కలిగి ఉందని, విస్తారిత స్త్రీగుహ్యాంకురాన్ని పోలిన "మైక్రో పెనిస్"("Micro Penis") ఉందని స్పష్టం చేసింది. ఈ రిపోర్ట్ ప్రస్తుతం వైరల్ గా మారడంతో.. మహిళాగా చెప్పుకొని ఒలింపిక్స్ లో పతకం సాధించిన తనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వర్షం కురిపిస్తున్నారు. కాగా ఈ రిపోర్టును ఆదారంగా చేసుకొని ఒలిపింక్స్ అధికారులు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనే విషయం తెలియాల్సి ఉంది.