చరిత్ర సృష్టించిన శ్రీలంక.. టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో భారీ విజయం

Update: 2023-04-18 11:43 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఐర్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో శ్రీలంక ఇన్నింగ్స్‌ 280 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో శ్రీలంకకు ఇదే అతి భారీ విజయం. ఓవరాల్‌గా టెస్ట్‌ల్లో అతి భారీ విజయం​రికార్డు ఇంగ్లండ్‌ పేరిట ఉంది. 1938లో ఇంగ్లండ్‌.. ఆస్ట్రేలియాపై ఇన్నింగ్స్‌ 579 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక.. తొలి ఇన్నింగ్స్‌ను 591/6 స్కోర్‌ వద్ద డిక్లేర్‌ చేయగా.. కెప్టెన్‌ దిముత్‌ కరుణరత్నే (179), కుశాల్‌ మెండిస్‌ (140), దినేశ్‌ చండీమాల్‌ (102 నాటౌట్‌), సమరవిక్రమ (104 నాటౌట్‌) సెంచరీలతో కదం తొక్కారు.

అనంతరం ఐర్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 143 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఫాలోఆన్‌ ఆడిన ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌లోనూ 68 పరుగులకే ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌లో జయసూర్య 3 వికెట్లు పడగొట్టగా.. రమేశ్‌ మెండిస్‌ 4, విశ్వ ఫెర్నాండో 2 వికెట్లు దక్కించుకున్నారు. రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో రెండో టెస్ట్‌ ఏప్రిల్‌ 24న జరుగనుంది.

Tags:    

Similar News