BCCI: తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి కి అరుదైన గౌవరం

మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో సోమవారం ఆస్ట్రేలియాతో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో భారత్ 184 పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే.

Update: 2025-01-01 05:00 GMT

దిశ, వెబ్ డెస్క్: మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌(Melbourne Cricket Ground)లో ఆస్ట్రేలియాతో జరిగిన బాక్సింగ్ డే టెస్టు(Boxing Day Test)లో భారత్ 184 పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ నాలుగో టెస్టు(Fourth Test) భారత మొదటి ఇన్నింగ్స్ లో సెంచరీతో రెచ్చిపోయిన భారత యువ ప్లేయర్, తెలుగు తేజం నితీశ్ కుమార్ రెడ్డి(Nitish Kumar Reddy)కి అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక మెల్‌బోర్న్ మైదానం(Melbourne Ground)లో అత్యుత్తమ ప్రదర్శన చేసినందుకు గాను నితీష్ కుమార్ రెడ్డి పేరున.. మెల్‌బోర్న్ హానర్స్ బోర్డు(Melbourne Honors Board)పై చేర్చారు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ షేర్ చేసింది. ఆ వీడియోలో మెల్ బోర్న్ హానర్స్ బోర్డుపై బూమ్రాతో పాటు, నితీష్ కుమార్ రెడ్డిని చేర్చడం కనిపించింది. కాగా ఆ సమయంలో నితీష్.. ఎమోషనల్ అయినట్లు కూడా కనిపించింది. ఏది ఏమైనప్పటికి నితీష్ సాధించిన ఘనత భారత జట్టుతో పాటు.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు అతనిపై నమ్మకాన్ని కల్పించాయి.


Similar News