IND Vs AUS: విజృంభించిన భారత బౌలర్లు.. ఆస్ట్రేలియా ఆలౌట్

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (Border-Gavaskar Trophy)లో భాగంగా సిడ్నీ (Sydney) వేదికగా ఆస్ట్రేలియా (Australia)తో జరుగుతోన్న ఐదో టెస్ట్‌లో రెండో రోజు భారత బౌలర్లు విజృంభించారు.

Update: 2025-01-04 04:52 GMT

దిశ, వెబ్‌డెస్క్: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (Border-Gavaskar Trophy)లో భాగంగా సిడ్నీ (Sydney) వేదికగా ఆస్ట్రేలియా (Australia)తో జరుగుతోన్న ఐదో టెస్ట్‌లో రెండో రోజు భారత బౌలర్లు విజృంభించారు. దీంతో ఆసిస్ 181 పరుగులకు ఆలౌట్ అయింది. 1 వికెట్ కోల్పోయి 19 పరుగుల ఓవర్‌ నైట్ స్కోర్‌తో రెండో రోజు ఇన్సింగ్స్‌‌ను ఆరంభించిన ఆ జట్టుకు పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ చుక్కలు చూపించారు. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఆసిస్ టాపార్డర్ నడ్డి విరిచారు. ఈ మ్యాచ్ అతిథ్య జట్టు తరఫున అరగేట్రం చేసిన వెబ్‌స్టర్ (Webster) (57) తొలి మ్యాచ్‌లోనే అర్థ సెంచరీతో అదరగొట్టాడు.

ఆసిస్ తొలి ఇన్సింగ్స్‌లో సామ్ కోన్‌స్టాస్ (Sam Konstas) (23), స్టీవ్ స్మిత్ (Steven Smith) (33), అలెక్స్ కేరీ (Alex Carey) (21) మాత్రమే చెప్పుకోదగిన స్కోర్ చేశారు. జట్టులో మిగతా బ్యాట్స్‌మెన్లు అంతా సింగిల్ డిజిట్‌కే పెవీలియన్‌కు క్యూ కట్టారు. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) 3, ప్రసిద్ధ్ కృష్ణ (Prasidh Krishna) 3, జస్ప్రీత్ బుమ్రా (Jaspreet Bumrah) 2, నితీష్ రెడ్డి (Nitish Reddy) 2 వికెట్లు పడగొట్టారు. ప్రస్తుతం రెండో ఇన్సింగ్స్‌ను ఆరంభించిన టీమిండియా (Team India) వికెట్లు ఏమి కోల్పోకుండా 25 పరుగులు చేసింది. యశస్వీ జైస్వాల్ 19 బంతుల్లో 20 పరుగులు, కేఎల్ రాహుల్ 10 బంతుల్లో 4 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. కాగా, భారత్ 33 పరుగులు లీడ్‌లో ఉంది.    

Tags:    

Similar News