Sunil Gavaskar: హార్దిక్ కన్నా.. నితీష్ రెడ్డి చాలా బెటర్.. సునీల్ గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (Border-Gavaskar Trophy)లో భాగంగా ఆస్ట్రేలియా (Australia)తో జరుగుతోన్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భారత్ తరఫున అరంగేట్రం చేసిన తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy) ఆదగొడుతున్నాడు.
దిశ, వెబ్‌డెస్క్: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (Border-Gavaskar Trophy)లో భాగంగా ఆస్ట్రేలియా (Australia)తో జరుగుతోన్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భారత్ తరఫున అరంగేట్రం చేసిన తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy) ఆదగొడుతున్నాడు. ఆడిన నాలుగు టెస్ట్‌లలో 8వ స్థానంలో బ్యాటింగ్ వచ్చిన నీతిష్ (294) అందరి కంటే ఎక్కువ పరుగులు సాధించాడు. ఈ క్రమంలోనే భారత దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ (Sunil Gavakar), నితీష్ రెడ్డిపై ప్రసంశల జల్లు కురిపించాడు. కేరీర్ ఆరంభంలోనే ఆడిన దానికంటే మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడని కొనియాడారు. మెల్‌బోర్న్ టెస్ట్ (Melbourne Test)లో సెంచరీతో భారత జట్టుకు మరో వజ్రం దొరికిందని అన్నారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అంతగా రాణించలేకపోయినా.. ఐపీఎల్ (IPL)లో సన్ రైజర్స్ తరఫున బ్యాటింగ్, బౌలింగ్‌లో సత్తా చాటిన నితీష్ రెడ్డిని అజిత్ అగార్కర్ సెలక్టర్ల బృందం ఆసిస్ టెస్ట్ సిరీస్‌కు ఎంపిక చేశారని గుర్తు చేశారు. వాళ్ల నమ్మకాన్ని నితీష్ ఏమాత్రం ఒమ్ము చేయలేదని కొనియాడారు. భారత్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) అరంగేట్రంలో ఆడిన దాని కంటే నితీష్ రెడ్డి చాలా మెరుగ్గా ఆడారని సునీల్ గవాస్కర్ అన్నారు.