NZ vs PAK : హసన్ నవాజ్ విధ్వంసం.. 44 బంతుల్లోనే సెంచరీ.. కివీస్‌పై భారీ విజయం
పాకిస్తాన్ ఓపెనర్ హసన్ నవాజ్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు.

దిశ, స్పోర్ట్స్ : పాకిస్తాన్ ఓపెనర్ హసన్ నవాజ్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. న్యూజిలాండ్‌తో మూడో టీ20లో 44 బంతుల్లో 105 పరుగులు చేసి పాక్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అక్లాండ్ వేదికగా జరిగిన మూడో టీ20లో పాక్ 9 వికెట్ల తేడాతో కివీస్‌ను చిత్తు చేసింది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిన పాక్ ఈ గెలుపుతో సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 19.5 ఓవర్లలో 204 పరుగులు చేసి ఆలౌటైంది. చాప్‌మన్ 44 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లతో 94 రన్స్ చేశాడు. అతడు రెచ్చిపోవడంతో రెచ్చిపోవడంతో కివీస్ భారీ స్కోరు చేసింది. కెప్టెన్ బ్రేస్‌వెల్(31) విలువైన రన్స్ జోడించాడు. పాక్ బౌలర్లలో హరిస్ రవూఫ్ 3 వికెట్లు, షాహీన్ అఫ్రిది, అబ్రార్ అహ్మద్, అబ్బాస్ అఫ్రిది చెరో 2 వికెట్లు తీశారు. భారీ లక్ష్య ఛేదనలో పాక్ ఏ మాత్రం తడబడలేదు. ఓపెనర్ హసన్ నవాజ్ కివీస్ బౌలర్లను ఊచకోతకోశాడు. 10 ఫోర్లు, 7 సిక్స్‌లతో మోతమోగించిన అతను 44 బంతుల్లోనే శతకం బాదాడు. మరో ఓపెనర్ మహ్మద్ హరిస్(41) కూడా మెరిసి నవాజ్‌తో కలిసి జట్టుకు శుభారంభం అందించాడు. ఆతర్వాత కెప్టెన్ సల్మాన్ అఘా(51 నాటౌట్) కూడా హాఫ్ సెంచరీతో రాణించాడు. నవాజ్ అజేయంగా నిలవడంతో పాక్ 16 ఓవర్లలో ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో పాక్‌కు భారీ ఊరట దక్కింది. ఓడితే సిరీస్ కోల్పోయేది. ఐదు టీ20 సిరీస్‌లో కివీస్ ఆధిక్యాన్ని 2-1కు తగ్గించింది.