IPL 2025 : ఐపీఎల్‌లోకి మరో తెలుగు కుర్రాడు అరంగేట్రం.. ఆ జట్టు తరపున ఎంట్రీ

ఆంధ్ర పేసర్ సత్యనారాయణ రాజు ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు.

Update: 2025-03-23 15:55 GMT
IPL 2025 : ఐపీఎల్‌లోకి మరో తెలుగు కుర్రాడు అరంగేట్రం.. ఆ జట్టు తరపున ఎంట్రీ
  • whatsapp icon

దిశ, స్పోర్ట్స్ : ఆంధ్ర పేసర్ సత్యనారాయణ రాజు ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. చెన్నయ్ సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ తరపున తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు. మెగా వేలంలో ముంబై అతన్ని రూ.30 లక్షల ధరకు దక్కించుకుంది. గతేడాది ఆంధ్ర ప్రీమియర్ లీగ్‌లో రాణించడం ద్వారా రాజు వార్తల్లో నిలిచాడు. 7 మ్యాచ్‌ల్లో 8 వికెట్లు తీశాడు. అలాగే, సయ్యద ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆంధ్ర తరపున 7 వికెట్లు తీసి సత్తాచాటాడు. ఇక, రంజీ ట్రోఫీ 2024-25లోనూ అదే అద్భు ప్రదర్శన కొనసాగించాడు. 6 మ్యాచ్‌ల్లో 16 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. రాజుతోపాటు జార్ఖండ్‌కు చెందిన రాబిన్ మింజ్ కూడా ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. దీంతో ఐపీఎల్ ఆడిన తొలి ట్రైబల్ క్రికెటర్‌గా మింజ్ నిలిచాడు. గతేడాది అతన్ని గుజరాత్ టైటాన్స్‌ తీసుకున్నా బైక్ యాక్సిడెంట్ కారణంగా టోర్నీకి దూరమయ్యాడు.


Tags:    

Similar News