George Foreman: శోకసంద్రంలో క్రీడాలోకం.. లెజెండరీ బాక్సర్ కన్నుమూత
ప్రముఖ లెజెండరీ బాక్సర్ జార్జ్ ఫోర్‌మెన్ (George Foreman) (79) కన్నుమూశారు.

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ లెజెండరీ బాక్సర్ జార్జ్ ఫోర్‌మెన్ (George Foreman) (79) కన్నుమూశారు. ఈ మేరకు ఆయన మరణ వార్తను కుటుంబ సభ్యులకు కూడా ధృవీకరించారు. 1968 మెక్సికో ఒలింపిక్స్ (Mexico Olympics)లో గోల్డ్ మెడల్ (Gold Medal) గెలవడంతో పాటు రెండు సార్లు వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్ (World Heavy Weight Champion)గా నిలిచాడు. ఫోన్‌మెన్ తన కెరీర్ మొత్తంలో 68 నాకౌట్లలో పాల్గొనగా కేవలం ఐదింట్లో మాత్రమే ఓడిపోయాడు. 1997లో బాక్సింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అదేవిధంగా 1974లో బాక్సర్ మహమ్మద్ అలీ (Muhammad Ali)తో జరిగిన నాకౌట్‌లో మాత్రం జార్జ్ ఫోర్‌మెన్ (George Foreman) ఓడిపోవడం గమనార్హం.