Vaishali : వరల్డ్ బ్లిట్జ్ ఛాంపియన్ షిప్ లో వైశాలికి కాంస్యం
వరల్డ్ బ్లిట్జ్ చాంపియన్ షిప్(World Blitz Championship) మహిళల విభాగం(Women's Category)లో భారత్ (India)కు చెందిన ఆర్. వైశాలి(Vaishali) కాంస్యం(Bronze) కైవసం చేసుకుంది.
దిశ, వెబ్ డెస్క్ : వరల్డ్ బ్లిట్జ్ చాంపియన్ షిప్(World Blitz Championship) మహిళల విభాగం(Women's Category)లో భారత్ (India)కు చెందిన ఆర్. వైశాలి(Vaishali) కాంస్యం(Bronze) కైవసం చేసుకుంది. వైశాలి క్వార్టర్ ఫైనల్స్ లో చైనాకు చెందిన జు జినార్పై 2.5-1.5 తేడాతో గెలిచింది. సెమీస్ లో చైనాకే చెందిన జు వెంజన్ చేతిలో 0.5-2.5 తేడాతో ఓడిపోయింది. దీంతో వైశాలి కాంస్యంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ర్యాపిడ్ ఈవెంట్ గేమ్ లో కోనేరు హంపి టైటిల్ సాధించడం విదితమే.
అయితే బ్లిట్జ్ చాంపియన్ షిప్ పోటీల్లో హంపి తో పాటు హారిక, అర్జున్, ప్రజ్ఞానందలు కూడా టాప్ 8లోకి వెళ్లలేక క్వార్టర్స్ లో అడుగుపెట్టలేకపోయారు.