బ్యాడ్మింటన్ ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్స్‌లో క్వార్టర్స్‌కు భారత్

బ్యాడ్మింటన్ ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్స్‌లో భారత్ క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది.

Update: 2024-06-29 13:33 GMT

దిశ, స్పోర్ట్స్ : ఇండోనేషియాలో జరుగుతున్న బ్యాడ్మింటన్ ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్స్‌లో భారత్ క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. గ్రూపు-సిలో తొలి మ్యాచ్‌లో వియత్నంను చిత్తు చేసిన భారత్.. రెండో మ్యాచ్‌లో ఫిలిప్పీన్స్‌ను ఓడించి క్వార్టర్స్‌కు చేరుకుంది. శనివారం జరిగిన రెండో గ్రూపు మ్యాచ్‌లో భారత్ 3-2 తేడాతో ఫిలిప్పీన్స్‌పై విజయం సాధించింది. తొలి గేమ్‌ అయిన మహిళల సింగిల్స్ మ్యాచ్‌లో తన్వి శర్మ భారత్‌కు శుభారంభం అందించింది. క్రిస్టేల్‌పై 9-21, 17-21 తేడాతో నెగ్గింది.

ఆ తర్వాత మెన్స్ సింగిల్స్ మ్యాచ్‌లో రౌనక్ చౌహాన్ ఓడటంతో ప్రత్యర్థి స్కోరును 1-1తో సమం చేసింది. అయితే, ఉమెన్స్ డబుల్స్‌లో వెన్నెల-శ్రావణి జంట, మెన్స్ డబుల్స్‌లో అర్ష్ మహమ్మద్-సంస్కార్ సరస్వతి జోడీ వరుసగా విజయాలు నమోదు చయడంతో 3-1తో భారత్ విజయం లాంఛనమైంది. అయితే, ఆఖరి మిక్స్‌డ్ డబుల్స్‌ మ్యాచ్‌లో భార్గవ్ రామ్-వెన్నెల జంటకు ఓటమి ఎదురైంది. అప్పటికే భారత్ విజయం ఖరారు కావడంతో ఆ ఓటమి నష్టం కలిగించలేదు. నేడు ఆఖరి గ్రూపు మ్యాచ్‌లో ఆతిథ్య ఇండోనేషియాతో భారత జట్టు తలపడనుంది. 

Similar News