ICC Test Rankings: ఐసీసీ టెస్ట్‌ ర్యాంకింగ్స్‌.. టాప్‌-10లో రోహిత్‌

వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీ సాధించిన భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టుల్లో 10వ ర్యాంకుకు ఎగబాకాడు.

Update: 2023-07-19 16:30 GMT

ముంబై: వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీ సాధించిన భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టుల్లో 10వ ర్యాంకుకు ఎగబాకాడు. ఇదే టెస్టులో 12 వికెట్లు సాధించిన భారత టాప్ స్పిన్నర్ అశ్విన్ బౌలింగ్‌లో 56 పాయింట్లతో నెంబర్ వన్‌గా కొనసాగుతున్నాడు. పురుషుల టెస్ట్ బ్యాటింగ్, బౌలింగ్ ర్యాంకింగ్స్‌ను ఐసీసీ తాజాగా విడుదల చేసింది.

బ్యాటింగ్‌లో రిషబ్ పంత్ 11, విరాట్ కోహ్లీ 14 స్థానాల్లో నిలిచారు. తొలి టెస్టులోనే 171 పరుగులతో అద్భుత ప్రతిభ కనబర్చిన యశస్వి జైస్వాల్ 73వ స్థానం సాధించాడు. బౌలింగ్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ రెండో స్థానంలో నిలిచాడు. విండీస్‌పై తొలి టెస్టులో ఐదు వికెట్లు సాధించిన రవీంద్ర జడేజా.. బౌలింగ్‌లో మూడు స్థానాలు ఎగబాకి ఏడో స్థానంలో నిలిచాడు. ఆల్‌రౌండర్‌లలో తొలి స్థానంలో కొనసాగుతున్నాడు.


Similar News